టికెట్‌ ధరలు తగ్గించడం వల్లే ఇబ్బంది

‘‘ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మంచిదే. దానివల్ల సమస్య లేదు. టికెట్‌ ధరలు తగ్గించడం వల్లే ఇబ్బంది. తెలంగాణలో టికెట్‌ ధరలు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగాలేదు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు నారాయణ్‌ దాస్‌ కే. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు. నాగశౌర్య కథానాయకుడిగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో శరత్‌ మరార్‌తో కలసి వారిద్దరూ నిర్మించిన చిత్రం ‘లక్ష్య’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘లక్ష్య’ కథ విన్నాక మంచి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ఆటతో పాటు అన్ని రకాల భావోద్వేగాలు ఉన్న చిత్రం ఇది. నాగశౌర్యకు కథ బాగా నచ్చి వెంటనే అంగీకరించాడు. తెలుగులో పూర్తిస్థాయి క్రీడా నేపథ్య చిత్రాలు అరుదు. ఆ తరహా చిత్రాల్లో ‘లక్ష్య’ ఓ ట్రేడ్‌మార్క్‌గా నిలుస్తుంది. కేతిక శర్మ నటన, కాల భైరవ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. 

Advertisement