ఈ-చలాన్‌లతో పరేషాన్‌

ABN , First Publish Date - 2021-04-06T06:33:59+05:30 IST

ప్రతీరోజు ఏదో ఒక పనిమీద కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ పట్టణ ప్రాంతాలకు వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి నిత్యం వేలాది వాహనాలు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చిపోతుంటాయి. వీరిలో ఎక్కువశాతం పేద, మధ్యతరగతికి చెందిన రైతులు, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఉద్యోగ,

ఈ-చలాన్‌లతో పరేషాన్‌

పార్కింగ్‌ స్థలాలు లేక వాహనదారుల ఇక్కట్లు 

పనిమీద పట్టణానికి వస్తే నిబంధనల పేరిట జరిమానాలు 

మున్సిపల్‌ అధికారుల అలసత్వం 

పోలీస్‌ చలాన్‌లతో ప్రజలకు తప్పని ఆర్థిక ఇబ్బందులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5: ప్రతీరోజు ఏదో ఒక పనిమీద కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ పట్టణ ప్రాంతాలకు వివిధ మండలాల్లోని గ్రామాల నుంచి నిత్యం వేలాది వాహనాలు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చిపోతుంటాయి. వీరిలో ఎక్కువశాతం పేద, మధ్యతరగతికి చెందిన రైతులు, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఉద్యోగ, వ్యాపారులు, కూలీలు, కార్మికులు ఉంటున్నారు. కాగా, ఈ పట్టణాలలో మెడి కల్స్‌, ఎరువుల దుకాణాలు, బోరుమోటార్లు, గొట్టాలు, బ్యాంకులు, కిరాణా దుకా ణాలు, వస్త్రవ్యాపార సముదాయాలు ప్రధాన రహదారుల వెంట ఉన్నాయి. వీటికి పార్కింగ్‌ స్థలాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ రహదారుల్ని ఆనుకుని ఉన్నాయి. వాహనాలు ఎక్కువసంఖ్యలో వస్తే రహదారిపై నిలిపి ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీంతో పోలీసులు ఫొటోలు తీసి ఈ-చలాన్‌లు పంపుతుండడంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. హెల్మెట్‌, లైసెన్స్‌, ట్రిబుల్‌ రైడిం గ్‌ చేసే వారికి చలాన్‌లు వేస్తూ.. వారిలో మార్పులు తీసుకురావడం బాగానే ఉన్నప్పటికీ.. అసలు పార్కింగ్‌ స్థలాలు లేకుండా చలాన్‌లు వేయడం పైనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు నిబంధనలు అత్రికమిస్తు సెల్లార్‌ లలో నిర్మాణాలు చేపట్టినా పట్టించుకోని అధికారులు.. తమకు మాత్రం రాంగ్‌ పార్కింగ్‌ పేరుతో చలాన్‌లు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

పార్కింగ్‌ చలాన్‌లపై మండిపడుతున్న జనం

రాంగ్‌ పార్కింగ్‌లో వాహనాలు నిలిపారంటూ పోలీసులు ఫొటోలు తీసుకుని ఈ-చలాన్‌ రూపంలో ఫైన్‌లు వేయడం పట్ల వాహనదారులు మండిపడుతు న్నారు. ఏదైనా పనిమీద పట్టణ కేంద్రాలకు రావాలంటేనే జంకుతున్నారు. నిబం ధనల పేరిట చలాన్‌లు వేయడంతో గ్రామీణ ప్రాంతాల వారు అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్‌ స్థలాలు ఉంటే తాము నిబంధ నల ను ఎందుకు విస్మరిస్తామని ప్రశ్నిస్తున్నారు. సెల్లార్‌లలో నిర్మాణాలు చేపట్ట డం, సరైన పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసుకోకుండా వ్యాపార సముదాయలు నిర్వ హిస్తున్న వారిని వదిలి తమను బాధ్యులను చేసి ఈ-చలాన్‌లు వేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. జేబులో రూపాయి లేకున్నా.. ఈ-చలాన్‌ వేయడంతో ఫోన్‌కు మెసేజ్‌ వచ్చే వరకు కూడా.. తమకు పెనాల్టీ పడిందన్న విషయం వాహనదారులకు తెలియడం లేదు. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు ముందుగా పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయకుండా పైన్‌లు వేయ డం సరికాదని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో జేబుకు చిల్లు

కామారెడ్డి, బాన్స్‌వాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ప్రాంతాలలో మున్సిపల్‌ అధికా రులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల పలు పనుల నిమిత్తం ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజల జేబులకు ఈ-చలాన్‌ రూపంలో చిల్లులు పడే పరిస్థితులు నెల కొన్నాయి. పట్టణంలోని సుభాష్‌రోడ్డు, తిలక్‌రోడ్డు, స్టేషన్‌రోడ్డు, జేపీఎన్‌ రోడ్డు, నిజాంసాగర్‌ రోడ్డు, కొత్తబస్టాండ్‌, సిరిసిల్ల రోడ్డు, పాతబస్టాండ్‌ లాంటి ప్రాంతా లలో నిత్యం వాహన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో పార్కింగ్‌ చేయడానికి స్థలాలు లేక ప్రజలు రోడ్లపైనే పార్కింగ్‌ చేస్తుంటారు. ఈ ప్రాంతా లలోని చాలా చోట్ల సెలార్ల నిర్మాణం చేపట్టినా అధిక ఆదాయం కోసం కక్కుర్తిపడే సదరు భవన యజమానులు, వ్యాపారుస్తు లు నిబంధనలకు విరుద్ధంగా వాటిలో నిర్మాణాలు చేపట్ట డం, లేదంటే సొంత ప్రయోజనాలకు వాడుకోవడం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేయాలో తెలియక వాహన దారులు రోడ్లపై పార్కింగ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా పార్కింగ్‌ చేసిన వాహనాలను పోలీసులు రోడ్డులో పార్కింగ్‌ చేశారంటూ ఈ- చలాన్‌లు వేస్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యం వీడి సెల్లార్లలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటున్నారు. 

పట్టణాలలో పార్కింగ్‌ స్థలాలు కలేనా?!

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపమో? సామాన్యు డు ఇబ్బందుల పాలయితే తమకేంటి అనే ఆలోచన ధోరణిని వీడకపోవడం వల్ల నో గాని అటు మున్సిపల్‌ అధికారులు, ఇటు పోలీసు అధికారులు నిబంధనలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఉదాసీనత ప్రదర్శిస్తూ.. తమ పట్ల మాత్రం కఠినంగా ఉండడం ఎంతవరకు సబబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై దృష్టిసారించి తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.   

పట్టణంలో వాహనాల పార్కింగ్‌ కోసం స్థలాల పరిశీలన

: మధుసూదన్‌, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి

జిల్లాకేంద్రంలో వాహనాల రద్దీ పెరుగుతుండడంతో పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలను మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పరిశీలిస్తాం. త్వరలోనే ద్విచక్ర వాహనాలు, ఆటోల కోసం ప్రత్యేక స్థలాలను గుర్తిస్తాం. ఆ స్థలాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేయిస్తాం. సెల్లార్‌లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకునే విధంగా మున్సిపల్‌ అధికారులతో చర్చలు జరిపుతాం. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తాం. దుకాణ సముదాయల నిర్వాహకులు తమ సెల్లార్‌లను కేవలం వాహనాల పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నాం. ఎవరైన నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు సైతం విధిస్తాం.

Updated Date - 2021-04-06T06:33:59+05:30 IST