తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో అలజడి

ABN , First Publish Date - 2020-03-10T11:20:47+05:30 IST

తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అలజడి రేగింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల పరిధిలోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో రైతులు, కర్ణాటక అటవీ

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో అలజడి

అటవీ అధికారులు,  రైతుల మధ్య వాగ్వాదం

బంట్వారం, మార్చి 9 : తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అలజడి రేగింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల పరిధిలోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో రైతులు, కర్ణాటక అటవీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం చించోళి తాలుకాలోని మగ్దంపూర్‌ గ్రామ సర్వేనంబర్‌ 140లోని 50 ఎకరాల భూమిని వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల తొర్మామిడి గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. సోమవారం కర్ణాటక అటవీ శాఖ ప్రత్యేక దళాలు పొలాలను యంత్రాలతో చదును చేశాయి.


విషయం తెలుసుకున్న రైతులు అధికారులకు అడ్డుపడ్డారు. తాము 50 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నామని, ఈ భూములే తమకు దిక్కు అని ప్రాధేయపడ్డారు. ఫారెస్టు అధికారులు భూములకు సంబంధించిన ఆధారాలు చూపాలని రైతులను అడిగారు. లేకుంటే అక్కడి నుండి వెళ్లి పోవాలని రైతులను హెచ్చరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2020-03-10T11:20:47+05:30 IST