Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రభుత్వ విధానాలతో ప్రజలకు ఇబ్బందులు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు
ఆసిఫాబాద్‌, డిసెంబరు 4:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అవలంబి స్తున్న విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు అన్నారు. జిల్లా కేంద్రంలోని రోజ్‌ గార్డెన్‌లో శనివారం ప్రారంభమైన జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఏడెళ్ల పాలంలో ప్రజలను పీల్చి పిప్పి చేశాయని అన్నారు. దేశంలో మత వాదాన్ని రెచ్చగొడుతూ బీజేపీ పబ్బం గడుపుకుంటున్నదని అన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాగా మోదీ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చే దిశగా  ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని చెప్పారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని నేడు రూ.41 కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిందని గుర్తు చేశారు. అయితే నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఉద్యమాలను అణిచివేసే దిశగా పని చేస్తున్నదన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యవా దులు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రవికుమార్‌, నాయకులు సోమయ్య, మధు, సత్యనారాణ, రాజన్న, లోకేష్‌, శ్రీనివాస్‌, దినకర్‌, కార్తీక్‌, రాజు, సాఇకృష్ణ, భీమేష్‌, రమణ, సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement