వైద్యాధికారి నిర్లక్ష్యంతో రోగులకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2022-05-18T05:35:21+05:30 IST

వైద్యాధికారి నిర్లక్ష్యంతో రోగులకు ఇబ్బందులు

వైద్యాధికారి నిర్లక్ష్యంతో రోగులకు ఇబ్బందులు
సమావేశంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

  • మండల సర్వసభ్య సమావేశంలో సభ్యుల ఆందోళన


కందుకూరు, మే 17: మండల పీహెచ్‌సీ వైద్యాధికారి నిర్లక్ష్యం వలన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఎంపీపీ మంద జ్యోతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కందుకూరు ఎంపీటీసీ  రాజశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ఈనెల 5వ తేదీన తమ గ్రామానికి చెందిన యువకుడు కుక్క కాటేసిందని పీహెచ్‌సీకి వెళ్తే గంటల తరబడి వైద్యులు గాని అందుబాటులో లేరని సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై వైద్యాధికారి డాక్టర్‌ రాఽధికను అడుగగా పొంతన లేని సమాధానం ఇచ్చారని ఆయన ఆరో పించారు. తన పేరుతో ప్రైవేటు ఆసుపత్రిని నడుపుతున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. దీంతో ఎంపీపీ మంద జ్యోతి, ఎంపీడీవో నర్సింహ్లులు కల్పించుకొని ఈ విషయంపై కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. అనంతరం నేదునూరు, కొత్తగూడ, గ్రామాల సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, సాధ మల్లారెడ్డిలు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారారైతులకు అందించే రాయితీలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతు వేదికల్లో శిక్షణ సజావుగా సాగడంలేదన్నారు. మీర్కాన్‌పేటలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ చుట్టూ 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రహరీని రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆ సర్పంచ్‌ బి.జ్యోతి, ఎంపీటీసీ కాకి రాములు ఆరోపించారు. దీంతో తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి కల్పించుకొని రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జైత్వారంలో నిర్మించిన ఆయిల్‌ మిల్లుకు పంచాయతీలో ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఇలాగే పోతే పంచాయతీకి వచ్చే ఆదాయం లేకుండా పోతుందని గ్రామ సర్పంచ్‌ సధాలక్ష్మి అన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైస్‌ఎంపీపీ జి.శమంతప్రభాకర్‌రెడ్డి, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ జగన్మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:35:21+05:30 IST