దళారూల్‌

ABN , First Publish Date - 2022-04-29T06:18:45+05:30 IST

సిద్ధప్ప ఓ చిరుద్యోగి.

దళారూల్‌
కల్లూర్‌ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం

  1. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల హవా
  2. ఒక్కో దస్త్రం ఒక్కో రేటు 
  3. రిజిసే్ట్రషన విలువను బట్టి అక్రమ వసూళ్లు
  4. కర్నూలు, కల్లూరు కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
  5. వెలుగు చూసిన అక్రమాలు
  6.  జిల్లా అంతటా ఇదే పరిస్థితి

సిద్ధప్ప ఓ చిరుద్యోగి. సొంత ఇల్లు కట్టుకోవాలనేది అతని చిరకాల వాంఛ. దీని కోసం తన దగ్గరున్న కొద్దిపాటి మొత్తంతో ఓ స్థలం కొనుగోలు చేశాడు. దీనిని రిజిసే్ట్రషన చేసేందుకు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లను కలిశాడు. రిజిసే్ట్రషనకు ఎంత ఖర్చవుతుందని అడిగాడు. వారు చెప్పిన మాటలు విని అవాక్కయ్యాడు. ఆ ఖర్చులన్నీ కలిపితే... మరో చిన్నపాటి స్థలం కొనుక్కునేటంతగా ఉన్నాయి. పోనీ కార్యాలయ సిబ్బందిని కలిసి...వివరాలు తెలుసుకుందామంటే...వారు ఆ అవకాశం ఇవ్వడం లేదు. డాక్యుమెంట్‌ రాయడానికి రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు. స్థలం ఖరీదును బట్టి చలానా. దీనికి అదనంగా సిబ్బందికి మామూళ్లు. ఒకవేళ వారు చెప్పిన మొత్తం ఇచ్చుకోలేనని చెబితే కొర్రీలు...చేసేదిలేక...వారు అడిగినంత చెల్లించి...ఎలాగోలా రిజిసే్ట్రషన తంతు ముగించాడు.  సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పనితీరుకు సిద్ధప్ప ఘటన ఓ తార్కాణం. జిల్లా వ్యాప్తంగా రోజూ అనేకమంది సిద్ధప్పలకు ఇలాంటి పరిస్థితేఎదురవుతోంది. 

- (కర్నూలు-ఆంధ్రజ్యోతి)సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో పరిస్థితి దొరికితే దొంగలు లేదంటే దొరలు చందంగా మారింది. డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను 2002 మేలో ప్రభుత్వం రద్దు చేసినా.. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో వారిదే పెత్తనం. వారు లేనిదే ఏ ఒక్క దస్త్రం సబ్‌ రిజిసా్ట్రర్‌ టేబుల్‌పైకి చేరదు. చేరినా రిజిసే్ట్రషన జరగదు. ఒక్కో రిజిసే్ట్రషనకు ఒక్కో రేటు చొప్పున అక్రమ వసూళ్లకు తెర తీసి ‘లోఫీజు.. బయటి ఫీజు’ పేరుతో దందా సాగిస్తున్నారు. ఒక డాక్యుమెంట్‌ రాస్తే రూ.2-3 వేలు, ఆ డ్యాక్యుమెంట్‌  రిజిసే్ట్రషన చేయాలంటే సబ్‌ రిజిసా్ట్రర్‌కు మరో రూ.2-3 వేలు చెల్లించుకోవాల్సి వస్తోంది. దస్త్రంలో లోపాలు ఉంటే ఆస్తుల విలువను బట్టి రూ.వేలు, లక్షలు వసులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే దళారుల దందా వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.05 లక్షలు అనధికారిక నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. 

(కర్నూలు-ఆంధ్రజ్యోతి)


స్థిరాస్తుల క్రయ విక్రయాలు, దాన సెటిల్మెంట్లు (గిఫ్ట్‌ డీడ్‌), వీలునామా.. వంటి డాక్యుమెంట్ల రిజిసే్ట్రషన కోసం కర్నూలు జిల్లాలో 11, నంద్యాల జిల్లాలో 11 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల పరిధిలో రోజుకు 800 నుంచి 950 వరకు వివిధ డాక్యుమెంట్ల రిజిసే్ట్రషన జరుగుతోంది. వీటిలో ముప్పాతిక శాతం భూములు, ప్లాట్లు, భవనాలు వంటి స్థిరాస్తుల రిజిసే్ట్రషన్లే ఉంటాయి. 20 ఏళ్ల కిత్రం ప్రతి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం పరిధిలో లైసెన్సడ్‌ స్టాంప్‌ రైటర్లు ఉండేవారు. వారి పెత్తనం పెరగడం, అవినీతికి డాక్యుమెంట్‌ రైటర్లే కేంద్ర బిందువుగా మారడంతో 2002 మేలో అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను రద్దు చేసింది. రికార్డుల్లో రద్దయి నా... సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో వారి పెత్తనానికి అడ్డుకట్ట పడలేదు. వారు లేనిదే రిజిసే్ట్రషన్లు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పేదే సిబ్బందికి వేదం. కర్నూలు, కల్లూరు, ఆదోని, ఎమ్మి గనూరు, అలూరు, కోడుమూరు, పత్తికొండ సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాల యాల్లో అధికంగా రిజిసే్ట్రషన్లు జరుగుతాయి. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన, బనగానపల్లె సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో ఎక్కువగా రిజి సే్ట్రషన్లు జరుగుతు న్నాయి. ప్రతి సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసు పరిసరాల్లో 15 నుంచి 35 మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. స్టాంపు డ్యూటీ, రిజిసే్ట్రషన ఫీజు కాకుండా వీరి ద్వారా కార్యాలయాలకు అదనంగా చెల్లించాల్సిందే. కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే దళారుల దందా వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.05 లక్షలు అనధికారిక నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. 

ఫీజులు.. రెండు రకాలు

ప్రభుత్వ సేవలు పొందడానికి ఒక రకమైన ఫీజే ఉంటుంది. జిల్లాలో కొన్ని సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసులకు వెళ్లి స్థిరాస్తుల   రిజిసే్ట్రషన కోసం డాక్యుమెంట్‌ రైటర్లను కలిస్తే.. ‘లోఫీజు.. బయట ఫీజు’ ఉంటుందని నిర్మొహమాటంగా  చెప్పేస్తున్నారు. బయటి ఫీజు అంటే స్టాంపు డ్యూటీ. ఇది చలానా రూపంలో ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. లోఫీజు అంటే.. రిజిసే్ట్రషన చేసినందుకు అనధికారికంగా ఇచ్చే మామూళ్లు. ఇది ఒక్కో సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ఒక్కో రకంగా ఉంటోంది. స్థిరాస్తి రిజిసే్ట్రషన విలువను బట్టి ఇది మారుతుందని విశ్వసనీయ సమాచారం. ప్రతి డాక్యుమెంట్‌ రిజిసే్ట్రషనకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు వసులు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దసా్త్రల్లో లోపాలు ఉంటే రూ.వేలు, లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. పొలం, ప్లాటు.. వంటివి రిజిసే్ట్రషన కోసం ఒక డాక్యుమెంట్‌ రాయాలంటే రైటర్లు తమ ఫీజుగా న్యాయంగా రూ.150-250 వరకు తీసుకోవచ్చు. ఇందుకు విరుద్ధంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు.  అన్ని సక్రమంగా ఉంటే సగటున రూ.10 వేల వరకూ వదులుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఖర్చులు అ‘ధనం’.

పేరుకే ఆనలైన... 

సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో దళారుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఆనలైన సేవలు తీసుకొచ్చింది. దసా్త్రలను సబ్‌ రిజిసా్ట్రర్‌ వెబ్‌సైట్‌లో ఎక్కడి నుంచైనా సరే ‘పబ్లిక్‌ డెటా ఎంట్రీ (పీడీఏ)’ చేస్తే సబ్‌ రిజిసా్ట్రర్‌ ఏ సమయంలో రావాలో స్లాట్‌ ఇస్తారు. ఆ సమయానికి వెళితే డాక్యుమెంట్లు పరిశీలించి తక్షణం రిజిసే్ట్రషన చేస్తారు. లోపాలు ఉంటే అక్కడే సరిదిద్దుతారు. ఈ విధానంలో దళారుల పాత్ర అసలే ఉండదు. దీనిపై వినియోగదారులకు సరైన అవగాహన లేదు. అవగాహన కల్పించాల్సిన స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన అధికారులు ఆ దిశగా తీసుకున్న చర్యలు నామమాత్రమే. అంతేకాదు..  అధిక శాతం వినియోగదారులకు డాక్యుమెంట్లు సొంతంగా రాసుకోవడం రాదు. స్టాంప్‌ డ్యూటీ ఆనలైన చెల్లింపులపై అవగాహన లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా అక్రమ వసూళ్లకు తెర తీస్తున్నారు. కొందరు సబ్‌ రిజిసా్ట్రర్లు డాక్యుమెంట్‌ రైటర్లు లేనిదే ఆ  పత్రాలను కనీసం చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

దళారులదే కీలక పాత్ర 

  ఫ కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో వంద మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. వీరే దళారుల పాత్ర పోసిస్తున్నారు. ఇక్కడ రోజుకు 200కు పైగా వివిధ రిజిసే్ట్రషన్లు జరుగుతున్నాయి. ఒక డాక్యుమెంట్‌ రాసినందుకు రూ.2వేల నుంచి రూ.3 వేలు, రిజిసే్ట్రషనకు మరో రూ.మూడు వేలు అదనంగా చెల్లించుకోవాల్సిందే. ఒక్కో డాక్యుమెంట్‌ రైటర్‌కు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు ఉంటున్నారు. వీరు రూ.10 వేల నుంచి 20 వేల అద్దెతో ఆఫీసులు నిర్వహిస్తున్నారంటే అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

- ఆదోని సబ్‌ రిజిసా్ట్రర్‌ పరిధిలో డాక్యుమెంట్‌ రైటర్లు 60 మంది ఉంటే.. వారికి అసిస్టెంట్లు మరో 60 మంది ఉన్నారు. ఒక డాక్యుమెంట్‌కు రూ.1000కి పైగా వసూలు చేస్తారు. క్రయ విక్రయాల విలువను బట్టి మామూళ్లు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయ పరిసరాల్లో వీరు ఉండకూడదు. కానీ ఆఫీసు పక్కనే తిష్ఠవేసి వీరి ఆజ్ఞ లేనిదే రిజిసే్ట్రషన్లు జరగకుండా కథ నడిపిస్తున్నారు. దీని వెనుక ఓ యువ నాయకుడి పాత్ర ఉందని సమాచారం. 

- ఎమ్మిగనూరు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో రోజుకు 30-40 రిజిసే్ట్రషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ డాక్యుమెంట్‌ రైటర్లు 20 మందికిపైగా ఉన్నారు. ఒక డాక్యుమెంట్‌కు రూ.500-1000 తీసుకుంటున్నారు. అవగాహన లేని రైతులు వస్తే రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. రిజిసే్ట్రషన విలువపై ఒక శాతం మామూళ్ల కింద అదనంగా వసులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేసే ఓ ఉద్యోగి హవా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

డాక్యుమెంట్‌ రైటర్లను రద్దు చేశారు

 డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను ప్రభుత్వం 20 ఏళ్ల క్రితమే రద్దు చేసింది. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల పరిధిలో అనధికారికంగా కొనసాగుతున్న మాట నిజమే. వీరిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వినియోగదారులే నేరుగా రిజిసే్ట్రషన చేసుకోవడానికి వీలుగా పబ్లిక్‌ డేటా ఎంట్రీ విధానం అమలులో ఉంది. ప్రజలకు అవగాహన లేకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. రిజిసే్ట్రషన విలువపై ప్రభుత్వం ని ర్దేశించిన స్టాంప్‌ డ్యూటీ మినహా ఒక్క పైసా అదనంగా వసూలు చేసినా తప్పవుతుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.  

 - కిరణ్‌కుమార్‌, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన్ల శాఖ, కర్నూలు

 అక్రమ రిజిసే్ట్రషన్ల వ్యవహారంలో ఆ ముగ్గురు

పత్తికొండ, ఏప్రిల్‌ 28: పత్తికొండ సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. సబ్‌రిజిస్ర్టార్‌, ఇతర సిబ్బందితో తమకున్న పరిచయాల ఆధారంగా సాధారణ డాక్యుమెంట్లను మొదలుకొని లింక్‌ డాక్యుమెంట్లు లేని రికార్డులను సైతం దర్జాగా రిజిసే్ట్రషన్‌ చేయిస్తున్నారు. ప్రధానంగా ముగ్గురు డాక్యుమెంటర్‌ రైటర్లు అక్రమ రిజిసే్ట్రషన్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. గతంలో ఏసీబీ దాడులలో సబ్‌రిజిసా్ట్రర్‌ పట్టుబడగా..మరొకరు నకిలీ డాక్యుమెంట్‌ కేసులో సస్పెన్షన్‌కు గురయ్యారు.

Updated Date - 2022-04-29T06:18:45+05:30 IST