Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 30 May 2022 10:58:21 IST

‘Boycott Laal Singh Chaddha’ అంటూ ట్రెండింగ్.. Aamir Khan సినిమాపై నెటిజన్ల కోపానికి కారణం ఏంటంటే..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. అందుకే ఈ స్టార్ సినిమా ఎప్పుడూ విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సూపర్‌స్టార్ నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్ధా’. కరీనా కపూర్, టాలీవుడ్ హీరో నాగచైతన్య ముఖ్య పాత్రలు పొషించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని మూవీ టీం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది.


ఈ తరుణంలో ఈ సినిమాని Boycott చేయాలంటూ  Boycott Laal Singh Chaddha యాష్‌ట్యాగ్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రెండింగ్ చేస్తున్నారు. గతంలో ఓ కార్యక్రమంలో ఆమీర్ మాట్లాడుతూ ఇండియాలో అసహనం ఎక్కువగా ఉందని, అందుకే ఈ దేశాన్ని విడిచి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సినిమా విడుదల సందర్భంగా ఆ కామెంట్స్‌ని ప్రస్తావిస్తూ ఆమీర్ సినిమాని చూడొద్దంటూ నెట్టింట ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా BoycottBollywood అనే యాష్‌ట్యాగ్‌ని కూడా ట్రెండ్ చేస్తున్నారు. కాగా.. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్‌’కి రిమేక్‌గా వస్తున్న ‘లాల్ సింగ్ చద్ధా’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. అయితే.. వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆగస్టు 11, 2022న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.





Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement