Abn logo
Mar 1 2021 @ 14:39PM

మీనాపై విమర్శలు.. ఏకీభవించిన డైరెక్టర్!

మలయాళ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం `దృశ్యం-2`. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటోంది. మొదటి భాగానికి మించిన ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమాలో మీనా లుక్ మాత్రం విమర్శలకు గురవుతోంది. మధ్య తరగతి గృహిణిగా, కష్టాల్లో చిక్కుకున్న ఇల్లాలి పాత్రలో నటించిన మీనా హెవీ మేకప్‌తో కనిపించింది. సెంటిమెంట్ సన్నివేశాల్లో సైతం మీనా డార్క్ లిప్‌స్టిక్‌, చెక్కు చెదరని మేకప్, హెయిర్ స్టైల్‌తో కనిపించింది. దీంతో నెటిజన్లు మీనా లుక్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. 

ఈ విమర్శలపై `దృశ్యం-2` డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్పందించారు. విమర్శకులతో ఏకీభవించారు. `అవును.. మీనా మేకప్ లేకుండా కనిపించాల్సింది. నేను షూటింగ్ సమయంలో ఆమెకు చెప్పాను. మేకప్ వద్దన్నాను. అయితే అందుకు మీనా ఒప్పుకోలేదు. మేకప్ లేకుండా నటించనని చెప్పారు. ఆమెను నేను కన్విన్స్ చేయలేకపోయాను. ఆర్టిస్ట్ సౌకర్యంగా లేకపోతే వారు సరిగ్గా పనిచేయలేరనే భావంతో నేను ఆమెతో ఆ విషయం గురించి ఆ తర్వాత చర్చించలేద`ని జీతూ చెప్పారు. ఈ సినిమా త్వరలో తెలుగులోకి రీమేక్ కాబోతోంది. సీనియర్ హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

Advertisement
Advertisement
Advertisement