షార్ట్‌సర్క్యూట్‌తో ట్రాలీ దగ్ధం

ABN , First Publish Date - 2020-02-20T10:36:21+05:30 IST

ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం అలుగుల వద్ద బుధవారం ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో ఓ

షార్ట్‌సర్క్యూట్‌తో  ట్రాలీ దగ్ధం

కూసుమంచి, ఫిబ్రవరి 19: ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయం అలుగుల వద్ద బుధవారం ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్‌తో ఓ ట్రాలీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న కూసుమంచి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలార్పేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందిన ఎండీ హబీబ్‌ అనే వ్యక్తి సెంకడ్‌హ్యాండ్‌ వాహనాల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఖమ్మంలో ఓ ట్రాలీ కొనుగోలు చేసుకుని హైదరాబాద్‌ వెళ్తున్నాడు.


ఈ క్రమంలో పాలేరు జలాశయం అలుగుల వద్దకు రాగానే వ్యాన్‌లో నుంచి పొగలు వస్తుండటంతో వెనుక బైక్‌ వస్తున్న వ్యక్తి వెంటనే హబీబ్‌ను అప్రమత్తం చేశాడు. హబీబ్‌ వ్యాన్‌ దిగిన వెంటనే వాహనానికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. ముందుగానే హబీబ్‌ కిందకు దిగటంతో పెనుప్రమాదం తప్పింది. ఫైర్‌సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్ధలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-20T10:36:21+05:30 IST