Abn logo
May 16 2020 @ 12:35PM

బిజీబిజీగా త్రివిక్రమ్!

ఈ ఏడాది సంక్రాంతికి `అల వైకుంఠపురములో..` సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీయార్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఎన్టీయార్ `ఆర్ఆర్ఆర్` పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 


సీనియర్ హీరో వెంకటేష్‌తో సినిమాను రూపొందించాలని త్రివిక్రమ్ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. `అజ్ఞాతవాసి` కంటే ముందే ఈ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. అప్పట్నుంచి అది వాయిదా పడుతూ వస్తోంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలోనే త్రివిక్రమ్ ప్రకటించారు. అలాగే మళ్లీ సినిమాల్లోకి ప్రవేశించిన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కూడా త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. ఇక, సూపర్‌స్టార్ మహేష్ బాబు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా త్రివిక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నారట. మరి, ఎన్టీయార్ సినిమా తర్వాత వీటిల్లో ఏ సినిమాను త్రివిక్రమ్ పట్టాలెక్కిస్తారో చూడలి. 

Advertisement
Advertisement
Advertisement