Abn logo
Oct 26 2020 @ 23:08PM

యంగ్‌ హీరోతో త్రివిక్రమ్‌ నెక్స్ట్‌ సినిమా

Kaakateeya

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో' సినిమా చేసిన తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే కరోనా కారణంగా అనుకున్న షూటింగ్‌ షెడ్యూల్స్ అన్నీ మారిపోవడంతో.. త్రివిక్రమ్‌తో సినిమాకి ఎన్టీఆర్‌ రెడీ అవ్వలేకపోయాడు. ఇంకా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా షూటింగ్‌లోనే ఎన్టీఆర్‌ ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేసి.. త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి చాలా టైమ్‌ పట్టేలా ఉండటంతో.. ఈ లోపు త్రివిక్రమ్‌ మరో యంగ్‌ హీరోతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.

ఆ యంగ్‌ హీరో ఎవరో కాదు ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని. ప్రస్తుతం రెడ్‌ సినిమా పూర్తి చేసిన రామ్‌తో త్రివిక్రమ్‌ సినిమా చేసేందుకు అన్ని కార్యక్రమాలు రెడీ అయ్యాయని, అధికారికంగా సినిమా ప్రకటించడమే తరువాయి అనేలా టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ వార్తలపై అధికారికంగా ఎటువంటి న్యూస్‌ ఇప్పటి వరకు రాలేదు. ఇక 'ఇస్మార్ట్ శంకర్‌' తర్వాత రామ్‌ నటించిన 'రెడ్‌' చిత్రాన్ని రాబోయే సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది.

Advertisement
Advertisement