Abn logo
Mar 26 2020 @ 09:49AM

త్రివిక్రమ్ రూ.20 లక్షల విరాళం!

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహాయపడేందుకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించనున్నారు. 


ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నార`ని వంశీ ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement