తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన బాలీవుడ్ చిత్రం `పీకూ`. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2015లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో దక్షిణాదికి రాబోతోందట.
`పీకూ`ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందట. ఇప్పటికే ఆ సినిమా హక్కులు కూడా తీసుకుందట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట. ఆ పాత్రలో నటించేందుకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.