సీనియర్ బ్యూటీ త్రిషకు స్పెషల్ ఇన్విటేషన్ లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఆమెకు ప్రత్యేకమైన గోల్డెన్ వీసా అందించింది. ఈ గౌరవం లభించటం వల్ల ఆమె ఇక మీద సుదీర్ఘకాలం పాటూ యూఏఈలో నివసించవచ్చు. గత కొద్ది రోజులుగా యూఏఈ ప్రభుత్వం పలువురు భారతీయ సినిమా ప్రముఖులకు గోల్డెన్ వీసాలు అందిస్తూ వస్తోంది. మోహన్ లాల్, మమ్ముట్టి, సంజయ్ దత్, జాన్వీ కపూర్ వంటి అనేక మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు...
యూఏఈ ప్రభుత్వం తమ దేశంలో సినిమా రంగం అభివృద్ధి కోసం పలువురు అంతర్జాతీయ సినీ ప్రముఖులకి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. అయితే, ఇంత వరకూ తమిళ సినిమా రంగం నుంచీ ఎవరికీ యూఏఈ గోల్డెన్ వీసా లభించలేదు. తొలిసారి త్రిషకు ఆ గౌరవం దక్కింది. అదే విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన చెన్నై బ్యూటీ వీసా అందుకుంటోన్న ఫోటో కూడా జత చేసింది. ‘‘గోల్డెన్ వీసా అందకున్న తొలి తమిళ యాక్టర్‌గా ఎంతో సంతోషిస్తున్నాను. ఇదొక గౌరవంగా భావిస్తున్నాను. థాంక్ యూ’’ అంటూ త్రిష తన పోస్ట్‌లో కామెంట్ చేసింది.