Jul 29 2021 @ 19:06PM

పలుమార్లు లైంగికంగా వేధించారు: త్రిష

జాతీయ పురస్కార గ్రహీత, రచయిత, డాక్యుమెంటరీ మేకర్‌ త్రిష దాస్‌ పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. గతంలో ఆమె ఓ డాక్యూమెంటరీకి పని చేస్తున్న సమయంలో నన్ను కొందరు చాలాసార్లు లైంగికంగా వేధించారు. నాలా ఇబ్బందులో ఎదుర్కొన్న మహిళలు ఎందరో ఉన్నారు. ఆ ఇబ్బందులను బయటపెట్టడానికి అప్పట్లో మీటూ ఉద్యమం, సోషల్‌ మీడియా అంతగా లేదు. ఎలాంటి దారుణం జరిగినా గొంతు నొక్కేసినట్లు ఉండేది. జవాబుదారీ తనం ఉండేది కాదు. మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచీ పరిస్థితులు చక్కబడ్డాయి’’ అని త్రిషా దాస్‌ పేర్కొన్నారు.