సమాజ అభివృద్ధికి త్రిపురనేని రామస్వామి కృషి

ABN , First Publish Date - 2022-01-17T05:03:21+05:30 IST

:ప్రముఖ హేతువాద, ఉద్యమనేత, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య కొనియాడారు.

సమాజ అభివృద్ధికి త్రిపురనేని రామస్వామి కృషి

ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య 

కడప(క్రైం), జనవరి 16:ప్రముఖ హేతువాద, ఉద్యమనేత, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సమాజ అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య కొనియాడారు. ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ ఆదేశాల మేరకు త్రిపురనేని రామస్వామి చౌదరి 135వ జయంతి సందర్భంగా ఘ నంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురనేని రామస్వామి కృష్ణాజిల్లా అంగలూరులోని రైతు కుటుంబంలో జ న్మించారని, చదువుకుంటూనే ఆయన రాసిన రాణాప్రతాప్‌ నాటకాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఆ తరువాత పురాణాలపై తిరుగుబాటు చేస్తూ కురుక్షేత్ర సం గ్రామం రాశారని తన స్వగ్రామమైన అంగలూరులో అష్టావధానం, శతావధానం చేశారని గుర్తు చేశారు. ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, వీరేష్‌, సోమశేఖర్‌నాయక్‌, ఆర్‌ఎ్‌సఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T05:03:21+05:30 IST