రోజుకు ఒక్కో బాలిక వద్దకు ఆరుగురు విటులను పంపించి వ్యభిచారం

ABN , First Publish Date - 2022-01-31T15:41:42+05:30 IST

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నలుగురు మైనర్ బాలికలను చెన్నై నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్టున్న త్రిపుర వాసి చలేమా ఖాతున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు...

రోజుకు ఒక్కో బాలిక వద్దకు ఆరుగురు విటులను పంపించి వ్యభిచారం

  • Chennaiలో మైనర్ బాలికలతో బలవంతంగా వ్యభిచారం
  • త్రిపుర మహిళ అరెస్ట్

చెన్నై: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నలుగురు మైనర్ బాలికలను చెన్నై నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్టున్న త్రిపుర వాసి చలేమా ఖాతున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. త్రిపురకు చెందిన 14.-17 ఏళ్ల వయసు గల నలుగురు మైనర్ బాలికలను చలేమాఖాతున్ చెన్నైకు తీసుకువచ్చారు. మసాజ్ పార్లర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాలికలను తీసుకువచ్చి వారితో చెన్నై పాడూరులోని ఓ అద్దె ఇంట్లో పెట్టి వ్యభిచారం చేయిస్తోంది. చలేమా సహచరులు అల్లావుద్దీన్, మొయినుద్దీన్, అలంగీర్ హుసేన్ లు బాలికలను లైంగికంగా వేధించి దాన్ని చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసి వారిని వ్యభిచారంలోకి దించారని చెన్నై పోలీసులు చెప్పారు.బాలికలను రాత్రివేళ వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు నిందితురాలు చలేమాను అరెస్టు చేశారు.


 ఒక్కో బాలికను ప్రతీరోజు రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఆరుగురు పురుషుల వద్దకు పంపించి 50 వేలరూపాయలు సంపాదించేవారని పోలీసులు చెప్పారు. వ్యభిచారం చేయమని బాలికలను కొట్టి చిత్రహింసలు పెట్టారని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు లలిత చెప్పారు.ఈ వ్యభిచారానికి స్థానిక పోలీసులు కూడా మద్ధతు ఇచ్చారని, లంచం తీసుకొని నిందితులను వదిలివేశారని పోలీసు ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది.బాలికలను ప్లవర్ బజార్ లోని లాడ్జీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి వారిని బెంగళూరుకు తరలించేందుకు యత్నించారు. ఓ బాలిక తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు నలుగురు బాధిత బాలికలను కాపాడారు. వ్యభిచారం ముఠాకు అండదండలందించిన నలుగురు కానిస్టేబుళ్లపై తాంబరం పోలీసు కమిషనర్ రవి బదిలీ వేటు వేశారు.వ్యభిచారం రాకెట్ వ్యవహారంలో ఇతర  నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-01-31T15:41:42+05:30 IST