ఆస్పత్రి నుంచి పారిపోయిన బ్లాక్ ఫంగస్ పేషెంట్

ABN , First Publish Date - 2021-06-19T00:15:14+05:30 IST

బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టుగా భావిస్తున్న ఓ మహిళ ఆస్పత్రి నుంచి పారిపోవడంపై కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్లోని

ఆస్పత్రి నుంచి పారిపోయిన బ్లాక్ ఫంగస్ పేషెంట్

అగర్తాలా: బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టుగా భావిస్తున్న ఓ మహిళ ఆస్పత్రి నుంచి పారిపోవడంపై కలకలం రేగింది. పశ్చిమ బెంగాల్లోని సిలుగురి నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజి ఆస్పత్రి (ఎన్‌బీఎంసీహెచ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఈఎన్‌టీ వార్డులో చేరిన ఆమె... గురువారం సాయంత్రం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు ప్రాంతీయ కేంద్రంగా ప్రభుత్వం ఈ ఆస్పత్రిని కేటాయించింది. కాగా ఆస్పత్రి నుంచి పారిపోయిన మహిళ జాడ కనిపెట్టాలంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆమెను రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకి చెందిన మహిళగా చెబుతున్నారు. బెంగాల్‌ ఉత్తరాదిన బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ‘‘బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న పది మంది పేషెంట్లు ఎన్‌బీఎంహెచ్‌లో చికిత్స పొందుతున్నారు...’’ అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ మల్లిక్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-19T00:15:14+05:30 IST