త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ రాజీనామా

ABN , First Publish Date - 2022-05-15T07:34:10+05:30 IST

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

త్రిపుర సీఎం విప్లవ్‌ దేవ్‌ రాజీనామా

కొత్త ముఖ్యమంత్రిగా మానిక్‌ సాహా..

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పు


అగర్తల, న్యూఢిల్లీ, మే 14: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మానిక్‌ సాహా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో ఇటీవల అంతర్గత పోరు కొనసాగుతోంది. దీంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎంను మార్చాలని అధిష్ఠానం నిర్ణయించింది. గురువారం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి వచ్చిన విప్లవ్‌ దేవ్‌ శనివారం గవర్నర్‌ ఎస్‌ఎన్‌ ఆర్య కు రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం సమావేశమైన బీజే పీ శాసనసభాపక్షం మానిక్‌ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించిన విప్లవ్‌ దేవ్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. డెం టిస్ట్‌ అయిన సాహా గతనెలలోనే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాగా, విప్లవ్‌దేవ్‌ అసమర్థతపై బీజేపీ బాస్‌లు విసిగిపోయారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శించింది. 

Updated Date - 2022-05-15T07:34:10+05:30 IST