tripple salary... అమెరికన్ పైలట్లకు ఆఫర్

ABN , First Publish Date - 2022-07-07T22:34:06+05:30 IST

షెడ్యూలింగ్ లోపం కారణంగా వేల సంఖ్యలో రద్దైన ట్రిప్పులను సమం చేసే క్రమంలో... అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలట్‌లు ట్రిపుల్ వేతనాన్ని పొందనున్నారు.

tripple salary... అమెరికన్ పైలట్లకు ఆఫర్

న్యూయార్క్ : షెడ్యూలింగ్ లోపం కారణంగా వేల సంఖ్యలో రద్దైన ట్రిప్పులను సమం చేసే క్రమంలో...  అమెరికన్ ఎయిర్‌లైన్స్ పైలట్‌లు ట్రిపుల్ వేతనాన్ని పొందనున్నారు. పీక్ హాలిడేలకు సంబంధించి... పైలట్లకు రెట్టింపు వేతనం కూడా లభించనుంది. షెడ్యూలింగ్ ప్లాట్‌ఫారమ్ లోపం కారణంగా పైలట్‌లు తమ షెడ్యూళ్ళ  నుండి దాదాపు 12 వేల విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు యూనియన్, అలైడ్ పైలట్స్ అసోసియేషన్ కిందటి వారం నివేదించింది.


వేసవి ప్రయాణ డిమాండ్‌లో పెరుగుదల సమయంలో విమాన అంతరాయాలను నివారించేందుకు అమెరికన్, ఇతర విమానయాన సంస్థలు తీవ్రంగా యత్నిస్తోన్న సమయంలో ఈ సమస్య తలెత్తింది. కాగా... 2017లో కూడా ఇదే విధమైన సమస్య ఏర్పడింది, సాంకేతిక సమస్య కారణంగా అమెరికన్ పైలట్లు... బిజీ డిసెంబరు సెలవు కాలంలో సెలవు తీసుకోవడానికి అనుమతి పొందారు. క్యారియర్ పైలట్లకు అసైన్‌మెంట్లను తీసుకున్న పైలట్లకు 150 % వేతనం అందించింది. 

Updated Date - 2022-07-07T22:34:06+05:30 IST