ట్రిపుల్‌ ఐటీ పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2020-12-06T04:52:06+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు 4,824 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన పరీక్షకు 134 మంది దూరంగా ఉన్నారు. కొవిడ్‌ నిబంధలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరిగింది.

ట్రిపుల్‌ ఐటీ పరీక్ష ప్రశాంతం
విద్యార్థులకు థర్మల్‌ స్త్రీనింగ్‌ చేస్తున్న దృశ్యం

 4824 మంది హాజరు 

కలెక్టరేట్‌, డిసెంబరు 5: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్షకు 4,824 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన పరీక్షకు 134 మంది దూరంగా ఉన్నారు. కొవిడ్‌ నిబంధలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరిగింది. విద్యార్థులంతా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. తొలుత గత నెల 28న పరీక్ష నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. నివర్‌ తుపాను నేపథ్యంలో వాయిదా వేశారు. జిల్లాలో 46 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ఓ పరీక్ష కేంద్రాన్ని విద్యా శాఖ అధికారి జి.నాగమణి పరిశీలించారు. మాస్క్‌లతో విద్యార్ధులు పరీక్ష రాశారు. తొలుత థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌ చేసి..పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన అమలు చేశారు. 


Updated Date - 2020-12-06T04:52:06+05:30 IST