తాండూరు అభివృద్ధికి ట్రిపుల్‌ జీవోలు

ABN , First Publish Date - 2022-07-03T05:22:13+05:30 IST

తాండూరు అభివృద్ధికి ట్రిపుల్‌ జీవోలు

తాండూరు అభివృద్ధికి  ట్రిపుల్‌ జీవోలు
సోమే్‌షకుమార్‌ను కలిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి


  • పారిశ్రామికవాడ, ఆటోనగర్‌, మార్కెట్‌ యార్డుకు స్థలం కేటాయింపు
  • జీవోలు జారీ.. కాపీలను ఎమ్మెల్యేకు అందజేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 

తాండూరు, జూలై 2: తాండూరులో పారిశ్రామికవాడ, ఆటోనగర్‌, మార్కెట్‌ యార్డుకు స్థల సేకరణకు ప్రభుత్వం ఒకేరోజు మూడు జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అందజేశారు. తాండూరులోని నాపరాయి పరిశ్రమను ఒకేచోట చేర్చడానికి తాండూరు మండలం జినుగుర్తి వద్ద నాపరాయి పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం సర్వే నెంబర్‌ 206లో 45 ఎకరాలను కేటాయిస్తూ జీవో 64ను జారీ చేసింది. భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం నిధులను సైతం విడుదల చేసింది. ఎకరం భూమిని రూ.12లక్షలకు సేకరించాలని జీవోలో పేర్కొన్నారు. అంతారం గ్రామం వద్ద ఆటోనగర్‌, లారీపార్కింగ్‌ కోసం 12ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అంతారం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 58లో 12 ఎకరాల భూమిని కేటాయించాలని జీవో 65ను జారీ చేసింది. భూసేకరణ నిమిత్తం ఎకరా భూమికి రూ.25 లక్షల చొప్పున వెచ్చించిసేకరించాలని జీవోలో సూచించారు. పట్టణశివారులోని కోకట్‌ రెవెన్యూ పరిధిలో కొత్త మార్కెట్‌ యార్డుకు 30ఎకరాలను సేకరించేందుకు గాను జీవో66నుజారీ చేసింది. ఎకరం భూమికి రూ.30లక్షల చొప్పున వెచ్చించి సేకరించాలని జీవోలో సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ మాట తప్పకుండా హామీ మేరకు జీవోలో జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ కార్యదర్శి సోమే్‌షకుమార్‌కు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.తాండూరు అభివృద్ధి మాటలతో కాకుండా చేతలతో చూపిస్తానని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - 2022-07-03T05:22:13+05:30 IST