నేడు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN , First Publish Date - 2020-12-05T04:46:33+05:30 IST

ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ తెలిపారు. ‘జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తాం. మొత్తంగా 6,785 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

నేడు ట్రిపుల్‌ ఐటీ  ప్రవేశ పరీక్ష
నందిగాంలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు




 



60 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు 

గుజరాతీపేట/నందిగాం/జలుమూరు, డిసెంబరు 4 : 

ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ తెలిపారు. ‘జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తాం. మొత్తంగా 6,785 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిచేశా’మని డీఈవో తెలిపారు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపారు. ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు శుక్రవారం పరిశీలించారు. 



Updated Date - 2020-12-05T04:46:33+05:30 IST