నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీ తరగతులు

ABN , First Publish Date - 2021-01-18T05:14:25+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కారణంగా 2020-21 అడ్మిషన్ల ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగింది. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలె

నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీ తరగతులు
రిపోర్టింగ్‌ ధ్రువపత్రాలు అందిస్తున్న దృశ్యం




క్యాంపస్‌కు చేరుతున్న విద్యార్థులు
(ఎచ్చెర్ల)

 ట్రిపుల్‌ ఐటీ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ కారణంగా 2020-21 అడ్మిషన్ల ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగింది. రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలో ని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీలోని అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు చూపిన ప్రతిభ, రిజర్వేషన్‌ ప్రాప్తికి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయించారు. కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు వారికి నిర్ధేశించిన ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్‌ పొందాలి. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో విద్యార్థులు రిపోర్ట్‌ చేసేందుకు అవకాశమిచ్చారు. కొద్దిమంది విద్యార్థులు ఆదివారం రిపోర్ట్‌ చేశారు. మిగిలిన విద్యార్థులు సోమవారం చేరే అవకాశం ఉంది.

కొవిడ్‌ నిబంధనలతో..
ఇక్కడి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో సీటు పొందిన విద్యార్థుల కోసం ఐదు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. కొవిడ్‌ నిబంధనలననుసరించి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు పర్యవేక్షణలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాస్క్‌లను పంపి ణీ చేశారు. థర్మల్‌ స్కానింగ్‌తో పరీక్షించి క్యాంపస్‌ లోపలికి అనుమతించారు. మొత్తం 1,000 మందికి పైగా సీట్లు కేటాయిం చగా, ఆదివారం 63 మంది బాలికలు, 41 మంది బాలురు రిపోర్ట్‌ చేశారు.

కళకళలాడుతున్న క్యాంపస్‌
ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ చాలా రోజుల తర్వాత విద్యార్థులతో కళకళలాడు తోంది. గతేడాది మార్చి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. పీయూసీ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు ఆదివారం క్యాంపస్‌కు రావడంతో సందడి నెలకొంది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్‌లైన్‌లో తరగతులు ప్రారంభం కానున్నాయి.




Updated Date - 2021-01-18T05:14:25+05:30 IST