కోలీవుడ్: హాస్యనటుడు యోగిబాబు, కరుణాకరన్, సునైన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ట్రిప్’. యువ దర్శకుడు డెన్నిస్ మంజునాథ్ కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు ఇందులోని రెండు పాటలను తాజాగా విడుదల చేశారు. పూర్తి కామెడీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ కొనసాగనుంది. కొంతమంది స్నేహితులు కలిసి తలకోన అటవీ ప్రాంత పర్యటన కోసం ట్రిప్‌గా వెళతారు. ఆ అడవిలో వారు ఓ నరహంతక ముఠా చేతిలో చిక్కి వారుపడే కష్టాలకు హాస్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. వీరితో పాటు అమెరికన్ జాతికి చెందిన ఓ శునకం కీలక పాత్రలో కనిపిస్తుంది.
ఇందులో యోగిబాబు, కరుణాకరన్, సునైనా, మొట్ట రాజేంద్రరన్, ప్రవీణ్ కుమార్, వీజే సిద్ధు, వీజే రాకేష్, కల్లూరి వినోద్, రాజేష్ శివ, అతుల్యా చంద్ర, లక్ష్మి ప్రియ, నాన్సీ జెన్నిఫర్, సత్య, మ్యాక్మణి, సతీష్, అరుణ్ నీతు నటించారు. వీరిలో చాలమంది వెండితెరకు తొలిసారి పరిచయమవుతున్నారు. అలాగే, ఈ చిత్రానికి సంగీతం సిద్ధు కుమార్ అందించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను యువ గేయరచయిత మోహన్ రాజన్ రచించారు. ఈ చిత్రం సాయి ఫిలిమ్స్ స్టూడియోస్‌పై నిర్మాతలు ఏ.విశ్వనాథన్, ఈ.ప్రవీణ్ కుమార్ కలిసి నిర్మించగా, శక్తి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ వచ్చే నెల ఐదో తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనుంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కడు పుబ్బ నవ్వుకుంటారని, కరోనా కష్టకాలంలో ఎంతో శ్రమించి డీప్ ఫారెస్ట్‌లో ఈ మూవీని నిర్మించామని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని దర్శకుడు డెన్ని స్ మంజునాథ్ కోరారు. మరోవైపు ఈ మూవీ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది.