Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్రికరణశుద్ధిగా... అంటే...

త్రికరణశుద్ధిగా...’ అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అంటే మూడు చర్యల్లో శుద్ధిగా... నిర్మలంగా, నిజాయితీగా ఉండడం. దీన్నే ‘మనసా, వాచా, కర్మణా’ అంటారు. ‘మనసా’ అంటే మనం చేసే ఆలోచనలు, మనం చేసుకొనే సంకల్పాలు. ‘వాచా’ అంటే మనం మాట్లాడే మాటలు, చెప్పే విషయాలు. ‘కర్మణా’ అంటే మన చేతలు... మనం చేసే పనులు. ఇవన్నీ నిజాయితీగా ఉండాలి. మనసులో చెడు ఆలోచనలు చేయకూడదు, ఎవరికీ హాని చెయ్యాలని కోరుకోకూడదు. అసూయకు, అహంకారానికి, పక్షపాతానికి తావివ్వకూడదు. మన మాటలు అసత్యాలతో, నిందలతో, వేరొకరిని బాధపెట్టేలా ఉండకూడదు. అలాగే... చెడ్డపనులు చేయకూడదు, మన చర్యలు ఇతరులకు హాని కలిగించకూడదు. ఈ మూడిటికీ పరస్పర సంబంధం ఉంది. మనసులోని ఆలోచనలు మాట ద్వారా ప్రకటితమవుతాయి. మనసులో అనుకున్న పనులు కార్యరూపం దాలుస్తాయి. కాబట్టి వాక్కును, కర్మను నడిపించే మనసు శుద్ధంగా ఉండాలి. నిష్కల్మషమైన మనసు, సత్యంతో నిండిన వాక్కు, మంచికి దోహదపడే కర్మ... ఇవే మనిషికి ఉన్నతిని కలిగిస్తాయి.

Advertisement
Advertisement