Abn logo
Jul 5 2020 @ 15:47PM

నిర్మలను కాలనాగుతో పోల్చిన తృణమూల్... మండిపడిన బీజేపీ

కోల్‌కతా: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తృణమూల్ పార్టీ విషనాగుతో పోల్చింది. తృణమూల్ పార్టీకి చెందిన సెరాంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని ఆరోపించిన ఆయన అంతటితో ఆగక ఆమెను కాలనాగుతో పోల్చారు. దేశం నిర్మలా సీతారామన్ లాంటి ఆర్ధిక మంత్రినిగతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పాముకాటుకు మనుషులు చనిపోయినట్లుగానే నిర్మల ఆర్ధిక వ్యవహారాలతో జనం చనిపోతున్నారని కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. రైల్వేల ప్రైవేటీకరణను కూడా కల్యాణ్ బెనర్జీ తప్పుబట్టారు.


కల్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. తృణమూల్ పార్టీపై మమతా బెనర్జీ పట్టుకోల్పోయారని చెప్పడానికి కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలే ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విరుచుకుపడ్డారు. మమత పాలన అవినీతిమయమైపోయిందని, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో సహనం లేక తృణమూల్ నేతలు ఇలాంటి మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement