ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: చిన్నజీయ్యర్ స్వామి

ABN , First Publish Date - 2021-02-26T15:12:51+05:30 IST

రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి స్పష్టం చేశారు.

ఆలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: చిన్నజీయ్యర్ స్వామి

తిరుమల: రాష్ట్రంలో ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి స్పష్టం చేశారు. శుక్రవారం అభిషేకసేవలో తిరుమల శ్రీవారిని చిన్నజీయ్యర్ స్వామి దర్శించుకున్నరు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో స్వామీజీ మాట్లాడుతూ..విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని తెలిపారు. కొన్ని కారణాల చేత ఆలయాల ఆస్తులు కొన్ని అన్యాక్రాంతమయ్యాయన్నారు. దేవాలయాలను పరిరక్షించాల్సిన వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించడం లేదని విమర్శించారు. పరివేక్షణ లోపం కారణంగానే రాష్ట్రంలోని పలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.


రాయలసీమలో దాడులు జరిగిన 27 ఆలయాలను పరిశీలించానని...ఈ ఆలయాలలోని 17 ఆలయాలలో అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు సూచనలతో ఓ విఙ్ఞాపన పత్రాని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డికి అందజేసినట్లు తెలిపారు. తన విఙ్ఞాపన పట్ల సుబ్బారెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీలో చాలా ఆలయాలు అభివృద్దికి నోచుకోకుండా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. ఆలయాలు బాగున్నప్పుడే ప్రజలలో నైతిక ప్రవృత్తి బాగుపడుతుందని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వెల్లడించారు. 

Updated Date - 2021-02-26T15:12:51+05:30 IST