ఆలయాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది

ABN , First Publish Date - 2021-08-24T02:43:44+05:30 IST

ఆలయాలు బాగుంటేనే సమాజం బాగుంటుందని త్రిదండి చిన్న జీయర్ స్వామి

ఆలయాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది

సూర్యాపేట: ఆలయాలు బాగుంటేనే సమాజం బాగుంటుందని త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు.  జిల్లా కేంద్రంలో రూ.12 కోట్లతో చేపట్టే వెంకటేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ పనులకు చిన్న జీయర్ స్వామి, పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి భూమి పూజ చేసారు. అనంతరం చిన్న జీయర్ స్వామి మాట్లాడారు. సమాజంలో అన్నివర్గాల వారిని ఏకతాటిపై నిలిపే శక్తి అధ్యాత్మిక, దైవ కార్యవైక్రమాలకు ఉందన్నారు. గతంలోని ప్రభుత్వాలు సాహసించని ధార్మిక కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి నిర్మాణంతో శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు.  సమాజంలో భగవంతుడి ముందు అందరూ  సమానమేనన్నారు. ఆలయాలు బాగుంటే సమాజం బాగుంటుందన్నారు. 




మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ చేపడుతున్నామన్నారు. యాదాద్రి శిల్పులు, స్థపతులతో ఆలయ విస్తరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-08-24T02:43:44+05:30 IST