త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-14T05:11:45+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేట పట్టణంలో పాత బస్టాండ్‌ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.

త్రివర్ణ శోభితం

సిద్దిపేట పట్టణంలో భారీ ర్యాలీ

300 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

పాల్గొన్న కలెక్టర్‌, సీపీ, అదనపు కలెక్టర్‌


సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 13 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేట పట్టణంలో పాత బస్టాండ్‌ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఎన్‌ఎ్‌సఎస్‌, ఎన్‌సీసీ వలంటరీలు, పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ దేశభక్తి నినాదాలు చేస్తూ, దేశభక్తి పాటలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి వదిలివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీగా హాజరైన జనంతో స్వాతంత్య్ర స్ఫూర్తిని తెలియజేసేలా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దీని కోసం విద్యార్థులు, యువత, అధికారులు, మీడియా, పోలీస్‌, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కృషి చేశారని వివరించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీపీ శ్వేత మాట్లాడుతూ యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని ప్రదర్శించారని, అందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు కలకుంట్ల మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.


కుకునూరుపల్లిలో 3,333 జెండాలతో

కొండపాక, ఆగస్టు 13: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను కొండపాక మండలం కుకునూరుపల్లిలో విద్యార్థులు, యువకులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు 3333 జెండాలను చేతబూని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతినరేందర్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై జాతీయ జెండాలతో ఊరేగింపు కొనసాగింది. దేశభక్తి చాటి చెప్పే నినాదాలు, గీతాలతో రాజీవ్‌ రహదారి హోరెత్తింది. గ్రామపంచాయతీ వద్ద ప్రారంభమైన ర్యాలీ రాజీవ్‌ రహదారిపై అంబేడ్కర్‌ విగ్రహం నుంచి తిరిగి బస్టాండ్‌ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ మాట్లాడుతూ దేశభక్తిని చాటే విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రతీ ఒక్కరూ దేశభక్తిని చాటే విధంగా వజ్రోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాగల సుగుణ, ఈజీఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యురాలు కోలా సద్గుణ, రైతుబంధు సమితి కన్వీనర్‌ దుర్గయ్య, జిల్లా పంచాయతీ అధికారి దేవకిదేవి, డీఎల్పీవో వేదవతి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


స్వాతంత్య్ర స్ఫూర్తి తెలియజేసేలా వజ్రోత్సవాల నిర్వహణ : టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవాలను అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం జడ్సీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఏంపీటీసీలు, మార్కెట్‌కమిటీ, కో ఆపరేటివ్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మొత్తం 4,200 మందితో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు, నెక్లెస్‌ రోడ్డులో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతీ ఒక్కరు తమ కుటుంబసభ్యులతో హాజరై కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. 15 నిమిషాల పాటు పెద్దఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు జరపనున్నట్లు తెలిపారు. లేజర్‌షో, ప్రముఖులతో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని కోరారు. 16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారు అక్కడే 58 సెకన్ల పాటు సాముహిక గీతాలాపన చేపట్టాలని కోరారు. 

Updated Date - 2022-08-14T05:11:45+05:30 IST