తెలుగుజాతి ఘన కీర్తి.. ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T06:40:03+05:30 IST

తెలుగుజాతి ఘన కీర్తి ఎన్టీఆర్‌ అని వక్తలు నివాళులర్పించారు.

తెలుగుజాతి ఘన కీర్తి.. ఎన్టీఆర్‌
భీమడోలులో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతల నివాళులు

వర్ధంతి సందర్భంగా నివాళులు  

పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలు

తెలుగుజాతి ఘన కీర్తి ఎన్టీఆర్‌ అని వక్తలు నివాళులర్పించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నటరత్న డాక్టర్‌ నందమూరి తారక రామారావు  వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాయి. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

భీమడోలు, జనవరి 18: తెలుగుజాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా భీమడోలు పంచాయతీ కార్యాలయం, సంత మార్కెట్‌ ప్రాంతాల్లోని ఆయన  విగ్రహాలకు పూలమాల  వేసి నివాళులర్పించారు.  పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. 

గణపవరం: పేద, బడుగు, బలహీన వర్గాలకు పలు సంక్షేమ పథకాలు అమలుచేసిన ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో నిలిచారని వక్తలు కీర్తించారు.  గణప వరం, మొయ్యేరులలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం పేదలకు రొట్టెలు, పాలు పండ్లు  పంచారు.  టీడీపీ  నాయకుడు నంద్యాల మదన్‌ మోహన్‌ లచ్చిరాజు, పట్టణ అధ్య క్షుడు శ్రీనివాసరాజు, జిల్లా మహిళా కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు. 

నిడమర్రు: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత ఎన్టీఆర్‌ దేనని టీడీపీ నిడమర్రు మండల అధ్యక్షుడు ముత్యాల స్వామి అన్నారు. క్రొవ్విడిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సారికి లెనిన్‌ బాబు, ఆరిమిల్లి కనకారావు, దిగమర్తి విజయ్‌, తానుకొండ సూరన్న, మహమ్మద్‌ గఫార్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: మండలంలో ఎన్టీఆర్‌ విగ్రహాల వద్ద టీడీపీ నాయకులు   పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల అధ్యక్షుడు పి.విజయకుమార్‌, రెడ్డి సూర్యచంద్రరావు,  మోషే, సర్పంచులు సలగాల గోపి, దిడ్ల అలకనంద, నల్లా ఆనంద్‌, బోడపూడి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

పెరవలి:  మహనీయుడు ఎన్టీఆర్‌ అని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు.  పెరవలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల  వేసి నివాళులర్పించారు.  వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పార్టీ  మండల అధ్యక్షుడు సలాది కృష్ణమూర్తి, బొడ్డు రామాంజనేయులు, ఎంపీటీసీ రాపాక ప్రమీల, మానికిరెడ్డి మురళీకృష్ణ, శ్రీనివాస ప్రసాద్‌, శిరిగినీడి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. 

నిడదవోలు:  పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి  ఎన్టీఆర్‌ అని మాజీ సర్పంచ్‌ పంచదార వెంకట దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం గోపవరంలో ఎన్టీఆర్‌  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.    

ఉండ్రాజవరం:  అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే శేషారావు అన్నారు. వేలివెన్నులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాల్దరిలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కేవీ సుబ్బారావు  ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.  వేలివెన్ను సర్పంచ్‌ అత్తిలి సత్యనారాయణ, నాయకులు కుదప చక్రపాణి, సింహాద్రి రామకృష్ణ, బూరుగుపల్లి అచ్యుతరామయ్య, ఈర్పిన సత్యనారాయణ, పసల సుబ్బారావు, పీవీ రాము, టి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తణుకు: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని టీడీపీ పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిమి వెంకన్నబాబు, తమరాపు రమణమ్మ, గుబ్బల శ్రీనివాసు, ఇందిరాదేవి, హనుమంతు, తేతలి సాయి తదితరులు పాల్గొన్నారు.  వేల్పూరు, మండపాక, దువ్వ, కోనాల, ముద్దాపురం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్‌ విశ్వనాథం కృష్ణవేణి, ఆత్మకూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇరగవరం: కె. ఇల్లిందలపర్రులో టీడీపీ నాయకుడు రెడ్డి రాంప్రసాద్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  సర్పంచ్‌ మట్టా నాగమణి, నాయకులు గోగి వడ్డికాసులు పాల్గొన్నారు. రేలంగిలో నరసాపురం పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల  వేసి నివాళులర్పించారు.  గ్రామ అధ్యక్షులు మానే భాస్కరరావు, కార్యదర్శి కామన రాంబాబు, మండల యువత అధ్యక్షుడు గూడూరి నాగరాజు, అడ్డాల మెంటారావు తదితరులు పాల్గొన్నారు.

అత్తిలి:  యుగపురుషుడు ఎన్టీఆర్‌ అని  మండల అధ్యక్షుడు అనాల ఆదినారాయణ అన్నారు. అత్తిలి టీడీపీ కార్యాలయం వద్ద  ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల  వేసి నివాళులు అర్పించారు.  ఏఎంసీ  మాజీ చైర్మన్‌ దాసం బాబ్జి తదితరులు పాల్గొన్నారు.  కొమ్మరలో  ముదునూరి బాలకృష్ణంరాజు, ఆరవల్లిలో ఎంపీటీసీ వెలగల ప్రసాదరెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

తాడేపల్లిగూడెం అర్బన్‌:  ఎన్టీఆర్‌కు  భారతరత్న  ఇవ్వాలని తాడేపల్లిగూడెం నియోజవకర్గ టీడీపీ ఇన్‌చార్జి వలవల బాబ్జి అన్నారు. శేషమహల్‌ రోడ్డు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు అందజేసి పడాల వృద్ధాశ్రమంలో  అన్నసమారాధన నిర్వహించారు.  పట్టణ అధ్యక్షుడు బడుగు పెద్ద అధ్యక్షత వహించగా పార్టీ రాష్ట్ర అర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, దాసరి కృష్ణవేణి, పరిమి రవికుమార్‌, పాతూరి రాంప్రసాద్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

తాడేపల్లిగూడెం  రూరల్‌: ఎన్టీఆర్‌ అన్ని వర్గాల వారికి ఆదర్శమని  వలవల బాబ్జి పేర్కొన్నారు.  జగన్నాథపురంలో సర్పంచ్‌ పి. గౌరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  మాజీ సర్పంచ్‌ ము త్యాల సత్యనారాయణ, మండలాధ్యక్షుడు పరిమి రవికుమార్‌  తదితరులు పాల్గొన్నారు. మెట్ట ఉప్పరగూడెంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి  సుబ్బరాజు ఆధ్వర్యంలో వలవల బాబ్జి, సర్పంచ్‌ నివాళులర్పించారు. చినతాడేపల్లిలో పరిమి రవికుమార్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆరుగొలనులో జిల్లా కార్యదర్శి  రాంబాబు ఆధ్వర్యంలో సర్పంచ్‌ బుచ్చిబాబు,  పడాలలో మాజీ ఉప సర్పంచ్‌ కామిశెట్టి ఉమాశంకర్‌  నివాళులర్పించారు.

పెంటపాడు:  అలంపురంలో టీడీపీ నాయకులు పెనుమర్తి జగదీష్‌ చంద్రలక్ష్మీప్రసాద్‌, కండెల్లి సందీప్‌  ఆధ్వర్యంలో  వలవల బాబ్జి  ఎన్టీఆర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.  సర్పంచ్‌   ప్రగతి, ఎంపీటీసీ  శ్రీదేవి పాల్గొన్నారు. పడమరవిప్పర్రులో  సొసైటీ మాజీ అధ్యక్షుడు పసల అచ్యుతం నివాళుల ర్పించారు.  ఆకుతీగపాడులో జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొల్లూరి బాబు, మాజీ సర్పంచ్‌ ధనరాజు, మాజీ వైస్‌ ఎంపీపీ  ఉమాశంకర్‌, ఉమామహేశ్వరం  కొండ్రెడ్డి హైమవతి, బొద్దాని శ్రీనివాస్‌, కేవీ సుబ్బారావు  నివాళులర్పించారు. అనంతరం  విద్యార్థులకు పండ్లు, విద్యాసామగ్రి పంపిణీ చేశారు. 

Updated Date - 2022-01-19T06:40:03+05:30 IST