డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యువతకు స్ఫూర్తి

ABN , First Publish Date - 2021-12-07T06:17:29+05:30 IST

భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధ నకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యువతకు స్ఫూర్తి
తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి నివాళులు

జిల్లావ్యాప్తంగా ఘన నివాళులు

భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ  సాధ నకు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించు కుని ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి పలువురు నివాళులర్పించారు.  

తణుకు, డిసెంబరు 6: దేశంలో విభిన్న మతాలు, కులాల వారికి సమాన హక్కులు కల్పించిన మహనీయు డు డాక్టర్‌  బీఆర్‌ అంబేడ్కర్‌ అని మాజీ ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కలగర వెంకట కృష్ణ, ఒమ్మి రాంబాబు, గుబ్బల శ్రీనివాసు పాల్గొన్నారు.   వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, ఐనంపూడి శ్రీదేవి, కొవ్వూరి వెంకటరెడ్డి, వైసీపీ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, ఉండవల్లి జానకి తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుర్పించారు. ఎన్టీఆర్‌ పార్కు వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ నాయకులు బోసు, రామకృష్ణ, వరలక్ష్మి, తదితరులు పూలమాలలు వేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. సమత యువజన సం ఘం, బార్‌ అసోసియేషన్‌, బీఎస్పీ జైభీమ్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్‌, సురేంద్ర, రవితేజ, కిశోర్‌ పాల్గొన్నారు.

 ఇరగవరం : మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అలివేలు మంగతాయారు, ఎంపీడీవో రాజేశ్వరరావు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. 

 తాడేపల్లిగూడెం :  తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఓటీఎస్‌ ద్వారా సొమ్ము వసూలు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్‌ ఐలాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి వినతిపత్రం సమర్పించారు. పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, సర్పంచ్‌ పోతుల అన్నవరం, సుబ్బరాజు, తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు ముప్పిడి రమేష్‌, శీలి వెంకటాచలం, చెప్పుల వాసు పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి బొలిశెట్టి రాజేష్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, గుండుమోగుల సురేష్‌, పుల్లా బాబి, యండ్రపాటి రాజు, నల మంచి రాంబాబు, కేశవభట్ల విజయ్‌, సోమశంకర్‌ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ అంబేడ్కర్‌కు నివాళులర్పించారు. జిల్లా ఉపా ధ్యక్షుడు నరిసే సోమేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, యువమోర్చా కార్యదర్శి శ్రీరామ్‌ పాల్గొన్నారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం అఽధ్యక్షుడు వర్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బెనర్జీ, నియోజకవర్గ అధ్య క్షుడు విజయ్‌, యువజన ప్రధాన కార్యదర్శి చిన్న, పెంటపాడు మండల అధ్యక్షుడు మల్లేశ్వరరావు తదితరులు అంబేద్కర్‌కు నివాళులర్పించారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు గాజుల గోపి, ప్రధాన కార్యదర్శి  సత్య నారాయణ, కోశాధికారి దశరథ్‌రామ్‌ తదితరులు నివాళులర్పించారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌: మహోన్నత వ్యక్తి అంబేడ్కర్‌ అని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్‌ ఐలాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

పెంటపాడు:  గేటు సెంటర్‌, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు జై భీమ్‌ యూత్‌ ఆధ్వర్యంలో పెంటపాడు సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళ, ఎంపీటీసీ నాగమణి, బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ మండల అధ్యక్షుడు దత్తు ప్రసాద్‌, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదపోలు వీరరాఘవ తదితరులు పాల్గొన్నారు. డీఆర్‌ గోయెంకా డిగ్రీ కళాశాలలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బ్రహ్మచారి నివాళులర్పించారు. రావిపాడులో సర్పంచ్‌ సూరిబాబు, సొసైటీ చైర్మన్‌ వెంకటరమణ, జట్లపాలెంలో సర్పంచ్‌  మణిరాజు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నిడదవోలు: అంబేడ్కర్‌ అందరికీ మార్గదర్శకులని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. సోమవరం నిడదవోలు సంతమార్కెట్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.కృష్ణప్రసాద్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. జై భారత్‌ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి డేవిడ్‌కుమార్‌, పట్టణ ఎస్‌ఐ పి.నాగరాజు, ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ మేరీ సుజాత, అధ్యాపకుడు డి.హరీష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కుమార్‌ స్వామి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఉండ్రాజవరం:  బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీలో గుమ్మాపు చిత్రసేన్‌  తదితరులు పాల్గొన్నారు. వేలివెన్నులో ఎంఆరీపీఎస్‌ నాయ కుడు చెట్టే సుజనారావు, మండవల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

భీమడోలు: భీమడోలు సంతపేటలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. పార్టీ మండల అధ్యక్షుడు కొండబాబు, పెద్దిరాజు, రామతులసమ్మ, అంబిక, పైడిమాల యుగంధర్‌, ఆదిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. గుండుగొలనులో వైసీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.  ఎం.సూర్యనారాయణరాజు, మురళీ, శంకర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్‌ సుబ్బారావు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

గణపవరం : ఎంపీడీవో, పంచాయతీ కార్యాలయా ల్లో, అర్థవరం గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎం పీపీ దండు వెంకట రామరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైస్‌ చైర్మన్‌ రత్నా దుర్గాకుమారి, సర్పంచ్‌  అలంకారం, ఉప సర్పంచ్‌ దండు రాము, కాకర్ల విష్ణు శ్రీనివాసరావు, తహసీల్దార్‌ బొడ్డు శ్రీనివాసరావు, ఎంపీడీఓ జ్యోతిర్మయి, ఏఓ  ప్రసాద్‌ పాల్గొన్నారు. లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి క్లబ్‌ అధ్యక్షుడు కాళ్లకూరి సత్యనారాయణ మూర్తి బహుమతులు అందజేశారు.  

ఉంగుటూరు: ఎంపీడీవో కార్యాలయం, ఎస్సీ కాలనీ, నారాయణపురం శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు అంబేడ్కర్‌కు నివాళులర్పించారు.


Updated Date - 2021-12-07T06:17:29+05:30 IST