అగ్నికణం.. అల్లూరి

ABN , First Publish Date - 2022-07-05T06:29:59+05:30 IST

స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

అగ్నికణం.. అల్లూరి
కలిదిండి భాస్కరరావుపేటలో అల్లూరి చిత్రపటం వద్ద సీపీఎం నివాళులు

విప్లవ వీరుడికి ఘన నివాళులు

ఘనంగా 125వ జయంతి వేడుకలు

స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు.   ఆయన పోరాట పటిమ యువతకు స్ఫూర్తి కావాలని వక్తలు పిలుపునిచ్చారు.

కైకలూరు, జూలై 4: అల్లూరి జయంతి వేడుకలు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కైకలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అల్లూరి విగ్రహానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు  పూలమాల  వేసి నివాళులర్పించారు.  ఎంపీపీ అడవి కృష్ణ, వైస్‌ ఎంపీపీ  జహీర్‌, సర్పంచ్‌ నవరత్నకుమారి, బొడ్డు నోబుల్‌ తదితరులు పాల్గొన్నారు. వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షు డు గురజాడ ఉదయ్‌శంకర్‌ ఆధ్వర్యంలో అల్లూరి  విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వాకర్స్‌ సభ్యులు దండు రంగరాజు, లక్ష్మణరావు, రిటైర్డ్‌ ఎస్‌ఐ బాబూరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భుజబలపట్నంలో అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు మత్తె మేజర్‌ నరసింహులు, మాజీ సర్పంచ్‌  రామలక్ష్మీ, ఇందుకూరి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. వైవీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన వేడుకల్లో   వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.ఉదయ్‌ ప్రకాష్‌, అధ్యాపకుడు ఎం.హరిప్రసాద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

ముదినేపల్లి:   రాజానగరంలో అల్లూరి  విగ్రహానికి  మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు,  జడ్పీటీసీ మాజీ సభ్యులు విజయలక్ష్మి నివాళులర్పించారు. క్షత్రియ సంఘం నాయకులు సాగిరాజు సూర్యనారాయణరాజు, సాగి సుబ్బ రాజు, కొండరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు సాగిరాజు సత్యనారాయణ రాజు, కోసూరి రవిరాజు, అల్లూరి రమేష్‌ రాజు తదితరులు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భీమవరం అల్లూరి విగ్రహా విష్కరణకు కార్లు, బైక్‌లతో ర్యాలీగా వెళ్లారు.  టీడీపీ నాయకులు వీరాబత్తిన సుధ, దావు నాగరాజు తదితరులు అల్లూరికి నివాళులర్పించారు. ముదినేపల్లిలోని శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్‌ ఎం.శ్రీదేవి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముదినేపల్లిలోని దళిత సంఘాల కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు  బాబూరావు, జిల్లా అధ్యక్షురాలు  లావణ్య, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు  దానియేలు పాల్గొన్నారు. 

మండవల్లి: అల్లూరి స్ఫూర్తిగా దేశభక్తిని పెంపొందించుకోవాలని ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ ఎల్‌.ఎస్‌.భాస్కరరావు పిలుపు నిచ్చారు. సోమవారం మండవల్లి గ్రంథాలయంలో అల్లూరి చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రంథాలయాధికారి  పర్వీనా పాల్గొన్నారు.

కలిదిండి:  భాస్కరరావుపేటలో సీపీఎం నేతలు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శేషపు మహంకాళిరావు, వీరవల్లి భాస్కరరావు, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడినాడలో అల్లూరి విగ్రహానికి పూలమాల  వేసి నివాళులర్పించారు. 

ముసునూరు: గోపవరం గ్రంథాలయంలో సంస్థ కార్యదర్శి వి. రవి కుమార్‌ అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమన్నారు. అనంతరం వేసవి విజ్ఞాన శిబిరం లో జరిగిన పోటీల్లో విజేతలకు రవికుమార్‌ పోత్సహక బహుమతులను అందజేశారు.  గ్రంథాలయ అధికారి సునీల్‌ కుమార్‌, సచివాలయ కార్యదర్శి సుకుమార్‌, సిబ్బంది ఫణి, యోనా తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-05T06:29:59+05:30 IST