144 మంది ప్రయాణికులను కాపాడిన bullet train డ్రైవర్...హీరో అంటూ ప్రయాణికుల నివాళి

ABN , First Publish Date - 2022-06-07T17:36:12+05:30 IST

144 మంది బుల్లెట్ రైలు ప్రయాణికులను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన రైలు డ్రైవరుకు ప్రయాణికులు ఘనంగా నివాళులు అర్పించిన...

144 మంది ప్రయాణికులను కాపాడిన bullet train డ్రైవర్...హీరో అంటూ ప్రయాణికుల నివాళి

బీజింగ్: 144 మంది బుల్లెట్ రైలు ప్రయాణికులను రక్షించేందుకు ప్రాణత్యాగం చేసిన రైలు డ్రైవరుకు ప్రయాణికులు ఘనంగా నివాళులు అర్పించిన ఘటన చైనా దేశంలో తాజాగా వెలుగుచూసింది. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌లో రైలు పట్టాలు తప్పడాన్ని గుర్తించిన ఐదు సెకన్లలోనే బుల్లెట్ రైలు డి2809 డ్రైవర్ యాంగ్ యోంగ్ రైలును ఆపి 144 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న సమయంలో బురద, రాళ్లతో ఢీకొన్న తర్వాత పట్టాలు తప్పడంతో డ్రైవరు యాంగ్ యోంగ్ మరణించాడు.ఈ రైలు ప్రమాదంలో డ్రైవర్ యాంగ్ యోంగ్ మరణించగా, మరో 8మంది గాయపడ్డారని చైనా స్టేట్ రైల్వే గ్రూప్, జాతీయ రైల్వే ఆపరేటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.మిగిలిన 136 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.


రోంగ్‌జియాంగ్ స్టేషన్‌కు సమీపంలో రైలు సొరంగంలో ఉన్నప్పుడు యాంగ్ ట్రాక్‌పై అసాధారణతను గుర్తించి, అత్యవసర బ్రేక్‌లను నిమగ్నం చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రైలు డ్రైవరు యోంగ్ 1993 నుంచి 1996 వరకు పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ హైనాన్ కార్ప్స్‌లో పనిచేశారు.స్క్వాడ్ లీడర్‌గా,అత్యుత్తమ సైనికుడిగా యోంగ్ ప్రశంసలందుకున్నారు.పదవీ విరమణ చేసిన తర్వాత యాంగ్ కో-డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, ఫోర్‌మెన్, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్, గ్రౌండ్ డ్రైవర్, రైలు డ్రైవర్ ఉద్యోగాలను చేశారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన యోంగ్ ను చైనా ప్రజలు హీరోగా కొనియాడుతూ ఆన్‌లైన్‌లో నివాళులు అర్పించారు.


Updated Date - 2022-06-07T17:36:12+05:30 IST