అమర జవాన్లకు అశ్రుతాంజలి

ABN , First Publish Date - 2021-01-27T05:11:04+05:30 IST

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు అశ్రుతాంజలి ప్రకటిస్తూ రంగసముద్రం లో మాజీ ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసిన అమర వీర జవాన్ల స్మారక స్థూపాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభించారు.

అమర జవాన్లకు అశ్రుతాంజలి
పోరుమామిళ్లలో అమర స్థూపాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

గణతంత్ర వేడుకల్లో అమరవీరుల స్థూపం ఆవిష్కరించిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి

గ్రామగ్రామాన 72వ గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోరుమామిళ్ల మండలం రంగసముద్రంలో మాజీ ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభించారు. మైదుకూరు కోర్టులో జడ్జి బి బేబి రాణి, పులివెందుల కోర్టులో న్యాయమూర్తి పవనకుమార్‌ జెండాను ఆవిష్కరించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో చాన్సెలర్‌ కె.సి. రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


పోరుమామిళ్ల/బద్వేలు/గోపవరం/కలసపాడు/ బి.కోడూరు/ కాశినాయన/అట్లూరు/మైదుకూరు/ చాపాడు/ఖాజీపేట/బి.మఠం/దువ్వూరు/ వేంపల్లె/ పులివెందుల టౌన్‌, రూరల్‌/వేముల/లింగాల, జనవరి 26: దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు అశ్రుతాంజలి ప్రకటిస్తూ రంగసముద్రం లో మాజీ ఆర్మీ జవాన్లు ఏర్పాటు చేసిన అమర వీర జవాన్ల స్మారక స్థూపాన్ని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభించారు. పోరుమామిళ్లలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బద్వేలు మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన రమణారెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యద ర్శి చిత్తా రవిప్రకాశరెడ్డి, ఆర్మీ జవాన్లు, మాజీ ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కమలమ్మ అంబేడ్కర్‌ విగ్రహానికి, టీడీపీ నేత యనమల సుధాకర్‌నాయుడు గాంధీ విగ్రహానికి పూలమాల లు వేశారు. అటవీ కార్యాలయంలో ఫారెస్టు అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. బద్వేలు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఏపీ సగర కార్పొరేషన చైర్‌పర్సన గానుగపెంట రమణమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు.

కోర్టు వద్ద జూనియర్‌ సివిల్‌జడ్జి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్‌ శ్రీనివాసులరెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణయ్య, ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు,  మోటారు వాహనాల తనిఖీ అధికారి వై.ప్రసాద్‌ వారి వారి కార్యాలయాల వద్ద జాతీయ జెం డాను ఆవిష్కరిచారు. సీపీఐ జిల్లా కార్యదర్శి వీరశేఖర్‌, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌ జాతీయ జెం డాను ఆవిష్కరించారు. ఎస్‌బీవీఆర్‌ డిగ్రీకళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటసుబ్బారెడ్డి, రాచపూడి నాగభూషణం కళాశాలలో కళాశాల వ్యవస్థాపకుడు నాగభూషణం జెండా ఎగురు వేశారు. ఎనఎ్‌సఎ్‌స విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

గోపవరం మండలంలో గణతంత్ర దినోత్సవాలను ఘ నంగా నిర్వహించారు. ఇనఛార్జ్‌ తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఇనఛార్జ్‌ ఎంపీడీఓ భానుప్రసాద్‌,  డాక్టర్‌ వాసుదేవరెడ్డి, ఎస్‌ఐ జీవీ క్రిష్ణయ్య, ఐసీడీఎస్‌ సూ పర్‌వైజరు చంద్రకళ వారి వారి కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలసపాడు మండలంలో గణతంత్ర దినోత్సవాలు నిర్వహించా రు. తహసీల్దారు రామచంద్రుడు, ప్రభుత్వాధికారు లు జెండా వందనం గావించారు.

బి.కోడూరు మం డలంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఎంపీడీఓ ఉమామహేశ్వర్‌రావు,  తహసీల్దారు మధురవాణి, సహకార బ్యాంకు ప్రెసిడెంట్‌ ప్రభాకర్‌రెడ్డి, వైద్యాఽధికారి వర్ధనరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కాశినాయన మండలంలో గణతంత్ర దినోత్సవాలను నిర్వహించారు. తహసీల్దారు రవిశంకర్‌, ఎంపీడీఓ ముజఫర్‌రహీం, ఎంఈఓ బాలఓబయ్య జాతీయ పతాకం ఎగురవేశారు. నర్సాపురం జడ్పీ హైస్కూల్‌లో టెన్త్‌లో ప్రతిభకనబరిచిన ఇద్దరు విద్యార్థులకు గుండం సీతారామిరెడ్డి పంపిన రూ. 5000 నగదును ప్రధానోపాధ్యాయురాలు సుభాషిణి అందజేశారు.

అట్లూరు తహసీల్దార్‌ ఇందిరరాణీ, ఎంపీడీఓ సుజాతమ్మ, ఎంఈఓ విలియం రాజు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రెడ్డిపల్లి, కొం డూరు, కుంభగిరి, తంభళగొంది, కమలకూరు, మణ్యంవారిపల్లి, మాడుపూరు, ముత్తుకూరు  సచివాలయాల్లో  జెండా ఆవిష్కరించారు.

మైదుకూరు లో ఎన్‌సీసీ విద్యార్థులు  దాదాపు వంద మీటర్ల జాతీయ జెండాతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి రాయల్‌ కూడలిలో  మానవహారం చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో ర్యాలీలు చేపట్టారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జడ్జి బి బేబి రాణి జాతీయ జెండాను ఎగురవేశారు.

డీఎస్పీ విజయకుమార్‌, తహసీల్దారు ప్రేమంతకుమార్‌, ఎంపీడీఓ కుళాయమ్మ వారి వారి కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. ఇందిరమ్మకాలనీ, ప్రభుత్వ పాధమికోన్నత పాఠశాలలో వాసవీ క్లబ్‌, అనకుంట పాఠశాలలో వనితా క్లబ్‌ ఆధ్వర్యంలో రిపబ్లిక్‌డే నిర్వహించారు.
చాపాడు మండలంలో అధికారులు జాతీయ జెండా లను ఎగురవేశారు. తహసీల్దారు శ్రీహరి, ఎంపీడీఓ శ్రీధర్‌నాయుడు, ఎంఈఓ రవిశంకర్‌, పశువైద్య అధి కారి శిరీష, వెలుగు ఏపీఎం వెంకటరమణ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఖాజీపేట మండలంలో తహసీల్దార్‌  ఎం.వి.సూర్యనారాయణ రెడ్డి, ఎంపీడీ ఓ మైథిలి జెండాను ఆవిష్కరించారు.

బి.మఠం మండలంలో  తహసీల్దారు దైవాదీనం, ఎంపీడీఓ వెంగమునిరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు పతాకాన్ని ఎగురవేశారు. దువ్వూరు మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వ హించారు. తహసీల్దారు దామోదర్‌రెడ్డి, ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడ్డి, కస్తూర్భాగాంధీ గురుకుల పాఠశాల లో ప్రత్యేక అధికారి నాగలక్ష్మి జెండా ఆవిష్కరించా రు. 

వేంపల్లె మండలంలో గణతంత్ర దినోత్సవాల ను నిర్వహించారు. ట్రిపుల్‌ ఐటీలో ఆర్జీయూకేటీ చాన్సెలర్‌ ప్రొఫెసర్‌ కేసీరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ట్రిపుల్‌ఐటీల ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  డైరెక్టర్లు సంధ్యారాణి, జయరామి రెడ్డి, ఏఓ మోహనకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పులివెందుల పట్టణంలోని అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జండా రెపరెపలా డింది. కోర్టులో మెజిస్ర్టేట్‌ పవనకుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. తహసీల్దార్‌ మాధవకృ ష్ణారెడ్డి, ఎంపీడీఓ రెడ్డయ్యనాయుడు, అర్బన పోలీ స్‌స్టేషనలో డీఎస్పీ శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు.

జేఎన్టీయూ కళాశాలలో ప్రిన్సిపాల్‌ జీఎస్‌ఎస్‌ రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. లయోలా కళాశాల ఎనసీసీ, ఎనఎస్‌ఎస్‌ విద్యార్థు లు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వేముల మండలంలో ఎంపీడీఓ ఓబులేసు, తహసీల్దార్‌ నర సింహులు, వ్యవసాయ శాఖ  ఏఓ చెన్నారెడ్డి, వే ముల జడ్పీ హైస్కూల్లో ఎంఈఓ ఓబులేసు జాతీ య పతాకాలు ఆవిష్కరించారు.

లింగాల మండలం లో  జాతీయ జండా రెపరెపలాడింది. తహసీల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీఓ సురేంద్రనాథ్‌, ఎస్‌ఐ హాజీవలి,  తదితరచోట్ల జెండా ఎగురవేసి జాతీయ పతాకం ఆవిష్కరించారు.







Updated Date - 2021-01-27T05:11:04+05:30 IST