కరోనా వారియర్లకు సత్కారం

ABN , First Publish Date - 2021-01-25T11:35:07+05:30 IST

కరోనా వ్యాప్తి విపత్కర పరిస్థితుల్లో ఎదురొడ్డి పోరాడడంతో పాటు బాధితులకు అండగా నిలిచిన కరోనా వారియర్లను ‘జీఆర్‌ ఈవెంట్స్‌’ ్థ ఘనంగా సత్కరించింది. కరోనాకు బలైన 950...

కరోనా వారియర్లకు సత్కారం

చెన్నై (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి విపత్కర పరిస్థితుల్లో ఎదురొడ్డి పోరాడడంతో పాటు బాధితులకు అండగా నిలిచిన కరోనా వారియర్లను ‘జీఆర్‌ ఈవెంట్స్‌’ ్థ ఘనంగా సత్కరించింది. కరోనాకు బలైన 950 మందికి అంత్యక్రియలు నిర్వహించిన ఖలీద్‌ బృందాన్ని, 198000 కుటుంబాలకు అండగా నిలిచిన అలెర్ట్‌ ఫౌండేషన్‌, 500 మంది కోవిడ్‌ రోగులకు చికిత్స అందించిన సుభద్ర, 1.03 లక్షలమందికి సహకారం అందించిన కిషోర్‌ సుబ్రమణియన్‌, 40634 మంది వలస కార్మికులకు సాయం చేసిన దివ్య మనుదయ్యలను ఈ సందర్భంగా సంస్థ సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఆర్కాటు నవాబు నవాబ్‌ అసిఫ్‌ అలీ, వేలమ్మాళ్‌ పాఠశాల ఉపాధ్యక్షురాలు పుష్పలత, సినీ నిర్మాత విమలా బ్రిట్టో, ఐఏఎస్‌ అధికారి నందకుమార్‌ తదితరులు హాజరై పోలీసులు, ఎన్‌జీవో సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులను ఘనంగా సన్మానించారు. కోవిడ్‌ కాలంలో వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. 

Updated Date - 2021-01-25T11:35:07+05:30 IST