ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-01-19T05:44:23+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

గూడూరు, జనవరి 18: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. మంగళవారం గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఆయన 26వ వర్ధంతిని నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ అన్నదానం నిర్వహించారు. ముందుగా స్థానిక టీడీపీ కార్యాలయంలోని, గమళ్లపాళెం లోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమా లలు వేసి నివాళులర్పి ంచారు. బుధవారం తిరుపతిలో జరగనున్న చలో దళిత ప్రతిఘటన సదస్సును విజయవంతం చేయాలన్నారు. మాజీ కౌన్సిలర్‌ వాటంబేడు శివకుమార్‌ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. శ్రీనివాసులు, చెంచురామయ్య, అబ్దుల్‌ రహీం, శ్రావణి, లీలావతి, కొండూరు వెంకటేశ్వర్లురాజు, సురేంద్ర, పెంచలయ్య, కృష్ణయ్య, కోటేశ్వరరావు, గోపాలయ్య, కృష్ణమూర్తి, చంద్రమౌళి, భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

చిల్లకూరులో....

    స్థానిక దర్గా వద్ద  టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, ఆల్తాఫ్‌, బెల్లంకొండ రాజేంద్ర, ప్రవీణ్‌, మల్లికార్జున్‌, సునీల్‌, శివ, హేమంత్‌, లోకేష్‌, గంగాధర్‌, గోవర్థన్‌ పాల్గొన్నారు.

సూళ్లూరుపేట : టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ  ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలోఎన్టీఆర్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.  టీడీపీ నేత చిట్టేటి పేరు మాల్‌ సమకూర్చిన రూ. 20వేల విలువైన చీరలను పేద మహిళలకు నెలవల, వేనాటి సతీష్‌రెడ్డి, ఆకుతోట రమేష్‌చే పంపిణీ చేయించారు. కార్యక్రమంలో నేతలు శ్రీనివాసులు, ఏజీ కిషోర్‌, మెస్‌ రమణయ్య, మాధవనాయుడు, కట్టా సుధాకర్‌, నారాయణరెడ్డి పాల్గొన్నారు. 

నాయుడుపేట టౌన్‌ : నాయుడుపేట గడియారం సెంటర్‌ వద్ద   టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాజీ సీఎం ఎన్టీరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర, అత్తికాయల సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, గాలి రమేష్‌నాయుడు, రవి, నారాయణ, చిరువెళ్ల మునిరాజ ఉన్నారు.

వెంకటగిరి : తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్‌ చెరగని చిరునామా అని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. స్థానికంగా జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పట్టణంలోని తోలిమిట్టలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి,  అనంతరం బంగారుపేట, పాలకేంద్రం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటాలకు, ఎన్టీఆర్‌ కాలనీలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్‌ నాయుడు ఆధ్వర్యంలో గోషాసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన లెజండరీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  దాతలకు ఎన్టీఆర్‌ ట్రస్టు సర్టిఫికెట్లను అందజేశారు. అనతరం అక్కడే అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గంగోటి నాగేశ్వరావు, రవినాయుడు, శ్రీరామదాసు గంగాదర్‌, గెరిటి చెంచయ్యయాదదవ్‌, బీరం రాజేశ్వరావు పాల్గొన్నారు.

తడ : స్థానిక బజారుకూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నాయకులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్‌,  మండల అధ్యక్షుడు కామిరెడ్డి మురళీరెడ్డి, నాయకులు నీలకంఠం, సెల్వం, శివాజీ, వేనాటి జనార్థన్‌రెడ్డి, గిరిరెడ్డి, దేశప్పన్‌ పాల్గొన్నారు. 

చిట్టమూరు : టీడీపీ మండల కన్వీనర్‌ గణపర్తి కిశోర్‌ నాయుడు ఆధ్వర్యంలో నాయుకులు కార్యకర్తలు, అభిమానులు చిట్టమూరుకు చేరుకొని ఎన్‌టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళులఅర్పించారు. కామిరెడ్డి సునీల్‌రెడ్డి, బసివిరెడ్డి హరికృష్ణారెడ్డి, గణపర్తి గోపాల్‌ నాయుడు, బాబునాయుడు, కస్తూరయ్య, చెంచురామ ఆచారి, రషీ ద్‌, వెంకటయమణయ్య, బషీర్‌, సర్పంచ్‌ కోటయ్య, హరి పాల్గొన్నారు.

ఓజిలి: స్థానికంగా నేతలు ఎన్టీరామారావుకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనరు విజయకుమార్‌నాయుడు,  పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు ఖలీల్‌, నాయకులు వెంకటసుబ్బయ్య, శ్రీనివాసులరెడ్డి, పురుషోత్తంరాజు, సుధాకర్‌రెడ్డి, అల్లాభక్షు, పుల్లయ్య, నారాయణరెడ్డి పాల్గొన్నారు.  

డక్కిలి : టీడీపీ నేతలు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.  కార్యక్రమంలో కుమార్‌ యాదవ్‌, ఆరికట్ల శ్రీరాములు, మచ్చల వేణుగోపాల్‌, చెలికం శ్రీహరిరెడ్డి, పోట్టా మునెయ్య, పులి జనార్దనరెడ్డి, శ్రీనివాసులరెడ్డి,తిరుపాల్‌ నాయుడు, హరినాథ్‌ నాయుడు, అంకయ్య, చిరంజీవి, దుగ్గి వెంకటేశ్వర్లు, కొండయ్య  పాల్గోన్నారు.

రాపూరు : నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగు నీటిని అందిస్తూ చెన్నై వాసుల దాహార్తి తీర్చే తెలుగుగంగ ప్రాజెక్టు ఎన్టీఆర్‌ చలువేనని ఆ పార్టీ మండల ముఖ్య నాయకులు దండోలు వెంకటేశ్వర్లురెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, షేక్‌ యుక్తియార్‌ అన్నారు. స్థానిక కచేరి ముఖద్వారం వద్ద ఎన్టీఆర్‌ చిత్రపట్టాన్ని ఏర్పాటుచేసి   నివాళులర్పించారు. నాయకులు పచ్చిగళ్ల రత్నం, అహ్మద్‌, కాజా,  బాలకృష్ణ, రాజా, సికిందర్‌, అఫ్రోజ్‌, లతీఫ్‌,  వసంత్‌, పరంధా మిరెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

పెళ్లకూరు : మండలంలోని కొత్తూరు గ్రామ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో నాయకులు నాగేంద్రప్రసాద్‌రెడ్డి, వి. మురళీ కృష్ణారెడ్డి, పేరం రమేష్‌నాయుడు, సుబ్రహ్మణ్యంరెడ్డి, డి. ప్రసాద్‌నాయుడు, కెవి నాయుడు, కె. శివకుమార్‌, కె. గోపాల్‌రెడ్డి, వి. శేఖర్‌నాయుడు, వెంకటేశ్వర్లు, మునేష్‌, పోలయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

వాకాడు : మండలంలోని వాకాడు, రాయగుంటపాళెంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తిరుమూరు శ్రీనివాసులురెడ్డి, కుంచం దయాకర్‌, కోటా శ్రీనివాసులు రావు, అయోధ్య బాల చంద్రయ్యశెట్టి, షేక్‌ గౌస్‌మొహిద్దీన్‌, గంగాధర్‌రెడ్డి  పాల్గొన్నారు. 

సైదాపురం : స్థానిక బస్టాండ్‌ సమీపంలో  టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్‌కృష్ణారెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మర్లపూడి గ్రామంలో తిరుపతి పార్లమెంట్‌ తెలుగు యువత ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వరదబండి వెంకటేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్నదానం జరిగింది. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్‌ రైతు సంఘం ఉపాధ్యక్షుడు కొండూరు సుబ్రమణ్యం రాజు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు నల్లమారు వెంకటేశ్వర్లు రెడ్డి, దశయ్య నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, కిరణ్‌, సర్పంచు రమణయ్య పాల్గొన్నారు.

బాలాయపల్లి : స్థానిక టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాజగోపాల్‌నాయుడు, రాయి మస్తాన్‌ నాయుడు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మండల ప్రదాన కా ర్యదర్శి శ్రీహరి, నాయుడు, శేఖర్‌, కోటి, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.

దొరవారిసత్రం : టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులునాయుడు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు జకరయ్య, నాయకులు సుబ్రహ్మణ్యంనాయుడు, శ్రీనివాసులురెడ్డి, మల్లేయ్య, కిషోర్‌నాయుడు, రవీంద్రనాయుడు, నాగయ్యనాయుడు, కొణతం కిషోర్‌, ప్రసాద్‌నాయుడు, మనోహర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, నాగేంద్రనాయుడు, షబ్బీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:44:23+05:30 IST