పేట డిపోలో డ్రైవర్లకు సన్మానం

ABN , First Publish Date - 2021-01-25T04:56:24+05:30 IST

నారాయణపేట ఆర్టీసీ డిపోలో డ్రైవ ర్స్‌ దినోత్సవాన్ని పురస్క రించుకొని ఉత్తమ డ్రైవర్లు ముగ్గురిని గుర్తించి ఆదివారం ఎస్‌ఐ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

పేట డిపోలో డ్రైవర్లకు సన్మానం
పేటలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు గులాబీ పువ్వును అందిస్తున్న డీఎం సూర్యప్రకాష్‌ రావు

నారాయణపేట, జనవరి 24 : నారాయణపేట ఆర్టీసీ డిపోలో డ్రైవ ర్స్‌ దినోత్సవాన్ని పురస్క రించుకొని ఉత్తమ డ్రైవర్లు ముగ్గురిని గుర్తించి ఆదివారం ఎస్‌ఐ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంత రం ఆర్టీసీ డ్రైవర్లు డిపో పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా డీఎం సూర్యప్రకాష్‌ రావుతో పాటు కండక్టర్‌ నజీర్‌లు బస్‌ డ్రైవర్లకు, డిపో ముందు ప్రధాన రహదారిపై వెళ్తున్న వివిధ వాహన డ్రైవర్లకు గులాబీ పువ్వును అందించి డ్రైవర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఎం సూర్యప్రకాష్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T04:56:24+05:30 IST