అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న కలెక్టర్
అనంతపురం క్లాక్‌టవర్: అసమానతలు లేని సమాజాన్ని స్థాపించడమే బీఆర్ అంబేడ్కర్‌కు మనమిచ్చే నివాళి అని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం స్థానిక జడ్పీ కా ర్యా లయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం అను నిత్యం పరితపించి, రాజ్యాంగాన్ని అందించిన అపరమే ధావి అంబేడ్కర్ అని తెలిపారు. చిన్నతనం నుంచే బడు గు, బలహీన వర్గాలు పడుతున్న బాధలను గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి రిజర్వేషన్లతోనే సాధ్య మని గ్రహించి వాటిని ఆ వర్గాలకందజేసిన మహనీయు డని కొనియాడారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ మధుసూదన, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహనరెడ్డి, డీఎ్‌సడబ్ల్యూఓ శివరంగప్ర సాద్, ఏఎ్‌సడబ్ల్యూఓ రెడ్డిబాలాజీ, ఎస్సీ కార్పొరేషన ఈడీ ప్రభాకర్‌రావు, ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.