కోవూరులో అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు
కోవూరు, జూలై3 : స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి సీపీఎం, డీవైఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికసంఘం జిల్లా నాయకుడు మారుబోయిన సుబ్బారావు మాట్లాడుతూ భీమ వరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠకు వస్తున్న ప్రధానమంత్రి మోదీ విభజన హామీల్ని అమలుచేయాలన్నారు. పోలవరానికి నిధుల విడుదలలో కేంద్రం జాప్యం తగదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకుడు పందిటి సురేంద్ర, సీపీఎం నాయ కులు గండవరపు శేషయ్య, గోవర్దన్, వెంకటేష్, శివ, సురేష్, కాలేష, బుజ్జయ్య, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.