ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T05:55:29+05:30 IST

జిల్లాలోని అన్ని ఏజెన్సీ మండలాలను కలిపి ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నడపాల సోమరాజు డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి
ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థులు

బుట్టాయగూడెం, జనవరి 28: జిల్లాలోని అన్ని ఏజెన్సీ మండలాలను కలిపి ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నడపాల సోమరాజు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదివాసీ విద్యార్థులతో కలిసి శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టా రు. ఆదివాసీ నాయకులు నడపాల సోమరాజు, సరియం రామకృష్ణ మాట్లా డుతూ 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాన్ని నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాం తమైన ఏలూరులో కలపడం వలన ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగు తుందన్నారు. ఏజెన్సీ మండలాలను కలిపి జిల్లాను ఏర్పాటు చేయడం కుద రకపోతే కేఆర్‌.పురం, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలను కలుపుతూ ప్రత్యేక ఆదివాసీ పార్లమెంటు జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నడపాల అఖిల్‌, టి.బిందు, ఎస్‌.శేఖర్‌, బి.సంద్య, జి.నిర్మల, కె.వంశీ, సీహెచ్‌ పవన్‌, ఎం.నాగదుర్గ, కె.సాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:55:29+05:30 IST