‘గుర్తింపు’నిస్తారా

ABN , First Publish Date - 2022-08-07T06:54:54+05:30 IST

జిల్లాలో గిరిజన ప్రాంతం గుర్తింపు హోదా కోల్పోయిన 56 గ్రామాలకు కష్టాలు తీరేందుకు మార్గం సుగమమైంది. జిల్లాల విభజన నేపథ్యంలో ఐటీడీఏ కోల్పోవడంతో మైదానప్రాంత గిరి జనులుగా మారిపోయిన 25వేలమంది ఆదివాసీలకు తిరిగి పూర్వవైభవం వచ్చేందుకు వీలు కలిగింది.

‘గుర్తింపు’నిస్తారా

  • రౌతులపూడి మండలం దడ్బాది గ్రామం
  • జిల్లాలో సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ మండలాల గిరిజనులకు ఇకనైనా కష్టాలు తీరేనా
  • 56 గ్రామాలనే షెడ్యూల్‌ ఏరియా గుర్తించడానికి ఎట్టకేలకు అధికారులు ఓకే
  • ప్రభుత్వానికి తాజాగా నివేదిక పంపిన రంపచోడవరం ఐటీడీఏ
  • జిల్లా కలెక్టర్‌ ద్వారా ఇంకా నివేదిక పంపని గిరిజన సంక్షేమశాఖ 
  • ఇటీవల జిల్లాల విభజనతో అల్లూరి జిల్లాలోకి రంపచోడవరం ఐటీడీఏ
  • కాకినాడ జిల్లా సబ్‌ప్లాన్‌ ఏజెన్సీలోని 25వేల మంది గిరిజనులకు ఐటీడీఏ నిల్‌ 
  • మైదాన ప్రాంత పరిధిలోకి రావడంతో కోల్పోయిన షెడ్యూల్‌ ఏరియా గుర్తింపు
  • తమను అల్లూరి జిల్లాలో కలపాలని కొన్నాళ్లుగా గిరిజనుల ఆందోళన

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గిరిజన ప్రాంతం గుర్తింపు హోదా కోల్పోయిన 56 గ్రామాలకు కష్టాలు తీరేందుకు మార్గం సుగమమైంది. జిల్లాల విభజన నేపథ్యంలో ఐటీడీఏ కోల్పోవడంతో మైదానప్రాంత గిరి జనులుగా మారిపోయిన 25వేలమంది ఆదివాసీలకు తిరిగి పూర్వవైభవం వచ్చేందుకు వీలు కలిగింది. ఈ మేరకు వీరందరు నివసిస్తున్న ప్రాంతాలను షెడ్యూల్‌ ఏరియా గుర్తించవచ్చని రంపచోడవరం ఐటీడీఏ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొం టూ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ననేది తేలాల్సి ఉంది. వీరందరికీ ఇకపై కొత్తగా ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేస్తుందా? లేదా గిరిజన ప్రాంతాలుగా గుర్తించి వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఈ నిర్ణయం ఆధారంగా జిల్లాలో ఆదివాసీలు చేస్తున్న ఆందోళనకు ముగింపు ఉంటుందా? లేదా? అనేది తేలనుంది.

ప్రభుత్వం ఏం చేస్తుందో..

జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలోని పది మండలాలు ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నాయి. వీటి పరిధిలోని 59 గ్రామాల్లోని 25వేలమంది గిరిజనులు తరతరాలుగా నివసిస్తున్నారు. దీంతో ఈ గ్రామాలన్నీ రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని సబ్‌ ప్లాన్‌ ఏజెన్సీ మండలాలుగా కొనసాగుతున్నాయి. వీరందరి బాగోగులు ఐటీడీఏ చూస్తోంది. విద్య, వైద్యం, రహదారుల సౌకర్యం మొదలు తాగునీటి వసతి, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథ కాల లబ్ధి, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్‌ వరకు అన్నీ వర్తింపచేస్తోంది. తీరా ఏప్రిల్‌లో జిల్లాల విభజనతో ఈ గ్రామాలన్నీ కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చాయి. రంపచోడవరం ఐటీడీఏ అల్లూరి జిల్లాలోకి వెళ్లిపోవడంతో అసలు చిక్కు మొదలైంది. ఐటీడీఏ ఒక జిల్లా, సబ్‌ప్లాన్‌ ఏజె న్సీ మండలాలు కాకినాడ జిల్లాలోకి వెళ్లడంతో కాకినాడ జిల్లాలోని 25వేలమంది గిరిజనుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా మారిపోవడంతో ఈ గిరిజనులతో ఇకపై తమకు సంబంధం లేదని రంపచోడవరం ఐటీడీఏ చేతులు దులిపేసుకుంది. 59 గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సమస్యలు, గిరిజనుల ఉద్యోగాల రిజర్వేషన్‌ ఏదీ తమకు సంబంధం లేదని అధికారులు తేల్చేశారు. దీంతో ఏ సమస్య వచ్చినా ఎవరూ పట్టించుకోకపోవడంతో జిల్లా పరి ధిలోని గిరిజనులు ఆందోళనకు దిగారు. ఇదంతా ఒకెత్తయితే రంపచోడవరం ఐటీడీఏనుంచి వేరుపడడంతో ఇప్పుడు కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చిన 59గ్రామాల్లోని గిరిజనులంతా మైదాన ప్రాంత గిరిజనులుగా మారిపోయారు. తద్వారా షెడ్యూల్‌ తెగల ఏరియా హోదా పో యి గిరిజనుల కోటా కింద వచ్చే ప్రయోజనాలన్నీ పోయాయి. ఈ నేపథ్యంలో పాతికవేల మంది గిరిజనులు తమను కాకినాడ జిల్లానుంచి తప్పించి అల్లూరి జిల్లాలో కలపాలని కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామసభ తీర్మానాలు చేసి జిల్లా కలెక్టర్‌కు కూడా పంపించారు. 59 గ్రామాల పరిధిలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సైతం వీరి న్యాయ పరమైన డిమాండ్‌కోసం ఆందోళకు మద్దతు ఇచ్చారు. షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించాలంటూ ఇటీవల జిల్లా పరిషత్‌లోను తీర్మానించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించాలా? లేదా? అనేదానిపై రంపచోడవరం ఐటీడీఏ పీవోనుంచి కాకినాడ కలెక్టర్‌ నివేదిక కోరారు. దీని పై అధ్యయనం చేసిన ఐటీడీఏ అధికారులు తాజాగా నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపా రు. 59 గ్రామాల్లో 56 గ్రామాలనే గిరిజన ప్రాంతాలుగా గుర్తించొచ్చని సిఫార్సు చేశారు. వీరంతా గిరిజనులే కాబట్టి ఐటీడీఏ విడిపోవడంతో వీరు నివసిస్తున్న గ్రామాలను గిరిజన తెగ గ్రామాలుగా ప్రకటించాలని నివేదికలో పేర్కొన్నారు. వీరికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయ డమా? లేదా షెడ్యూల్‌ ఏరియాగా గుర్తించి ఐటీడీఏ లేకుండా పథకాలు అమలు చేయడమా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నివేదికలో ప్రస్తావించారు. కాకి నాడ జిల్లాలో మండలాలవారీగా ఏయే గ్రామంలో ఎంతమంది ఆదివాసీలు ఉన్నారో జనాభా లెక్కలు కూడా నివేదికలో పొందుపరిచారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్నప్పుడు 56 గ్రామాలకు చేసిన ఖర్చు.. గ్రామాల్లో సామాజికవర్గాలవారీగా జనాభా తదితర విశ్లేషణలు కూడా క్రోడీకరించారు. ఈ నేపథ్యంలో మైదానప్రాంత గిరిజనులుగా మారిపోయిన ఆదివా సీలకు మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభు త్వం తదుపరి ఏం నిర్ణయం తీసుకుంటుందోననే సస్పెన్స్‌ నెలకొంది.

కలెక్టర్‌ నివేదిక ఏం చెబుతుందో..

జిల్లాలో 56 గ్రామాలను గిరిజన ప్రాంతాలుగా గుర్తించడానికి రంపచోడవరం ఐటీడీఏకు అ భ్యంతరం లేదని నివేదిక పంపిన నేపథ్యంలో కలెక్టర్‌నుంచి కూడా సిఫార్సులతో కూడిన నివే దిక ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇది ఇంకా సిద్ధం కాలేదు. ఎప్పుడు పంపుతారో ప్రస్తు తానికి స్పష్టత కూడా లేదు. రంపచోడవరం ఐటీడీఏ ఇచ్చిన నివేదికను అనుసరించి ప్రభుత్వం ఏం చేయాలనేదానిపై జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్‌ కొన్ని కీలక పా యింట్లు అందివ్వనున్నారు. ఇందులో 56 గ్రామాలకు ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలా? లేదా ప్రత్యేక అధికారి నియామకం ద్వారా మమ అనిపిస్తారా? అనేది నివేదికలో తేలాల్సి ఉంది. ప్రభుత్వం తమను గిరిజన ప్రాంతాల ఆదివాసీలుగా గుర్తించినా సరే అల్లూరి జిల్లాలో కలి పితేనే న్యా యం జరుగుతుందని గిరిజనులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎలాం టి నిర్ణయం తీసుకుంటుందోనని ఆదివాసీల్లో ఉత్కంఠ నెలకొంది. ఐటీడీఏ కాకుం డా ప్రత్యేకం గా ఏరియా గుర్తించినంత మాత్రాన తమకు న్యాయం జరగదని వీళ్లంతా వాదిస్తున్నారు.

Updated Date - 2022-08-07T06:54:54+05:30 IST