‘గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి’

ABN , First Publish Date - 2020-09-21T06:49:39+05:30 IST

ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి ఆరు గంటల పాటు విద్యాబోధన చేయాలంటూ గిరిజన సంక్షేమ శాఖ జారీ

‘గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి’

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 20: ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి ఆరు గంటల పాటు విద్యాబోధన చేయాలంటూ గిరిజన సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని టీయూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతనకంటి బాబు, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర సహఅధ్యక్షుడు మన్నె చంద్రయ్య డిమాండ్‌ చేశారు.


ఈ మేరకు వారు ఆదివారం వేర్వేరు ప్రకనటలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ నిబంధనలకు విరుద్ధంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే, ఎంపీలకు వైరస్‌ సోకడంతో అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలనే రద్దు చేశారని, అలాంటిది ఉపాధ్యాయుల జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేయమడనం సరికాదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉత్తర్వులను సవరించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-21T06:49:39+05:30 IST