గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-03-03T04:48:16+05:30 IST

గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందిం చేలా విద్యాబోధన చేయాలని రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ శ్రీకాంత్‌ ప్రభాకర్‌ అన్నారు.

గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి
మాట్లాడుతున్న గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ శ్రీకాంత్‌ ప్రభాకర్‌

పర్చూరు, మార్చి 2: గిరిజన విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందిం చేలా విద్యాబోధన చేయాలని రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ శ్రీకాంత్‌ ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం స్థానిక జీవీ ఎం కళాశాలలో గిరిజన పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని బోధన చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరి గేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గిరిజన విద్యార్థుల సం క్షేమం కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు నిధులు కేటాయిస్తుందని చెప్పారు. వీటిని సద్వినియోగపరిచి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నారు. 

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి ఈ.లలితా బాయ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరటంతో మెరుగైన వసతులు ఉన్న కళాశాలలోకి పాఠశాలలోకి మార్చినట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తం గా  పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌  పొన్నూరి శా మ్యూల్‌ జోబ్‌, డాక్టర్‌ హైమా సుబ్బారావు, ఏటీడబ్ల్యూవో వెంకటేశ్వర రావు, వైఆర్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం ఈ.రాజశేఖర్‌, వార్డెన్‌ జిత్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T04:48:16+05:30 IST