Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో 4 గిరిజన ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌

ఢిల్లీ: ఏపీలో నాలుగు గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్‌ పొందడానికి అర్హమైనవిగా గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్‌ సరూట వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 177 గిరిజన ఉత్పాదనలు జీఐ ట్యాగ్‌ పొందడానికి అర్హమైనవిగా ట్రైబల్‌ కోపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ట్రైఫెడ్‌) గుర్తించిందని చెప్పారు. అందులో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన గిరిజన ఉత్పాదనలు 88 ఉండగా, ఉత్తరాఖండ్‌లో 14, జార్ఖండ్‌లో 11, మధ్యప్రదేశ్‌లో 11, మహారాష్ట్రలో 10, ఒడిషాలో 6, పశ్చిమ బెంగాల్‌లో 9, గుజరాత్‌లో 7, చత్తీస్‌ఘడ్‌లో 7, ఆంధ్రప్రదేశ్‌లో 4 ఉన్నాయని తెలిపారు. అస్సాం, గుజరాత్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలోని 21 గిరిజన ఉత్పాదనలకు జీఐ ట్యాగింగ్‌ చేసే పనిని ట్రైఫెడ్‌ ఒక ఏజెన్సీకి అప్పగించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement