మైనింగ్‌ మాఫియా తక్షణం ఏజెన్సీ విడిచిపెట్టాలి

ABN , First Publish Date - 2020-10-23T10:22:22+05:30 IST

మైనింగ్‌ మాఫియా మన్యంలో విలువైన ఖనిజ సంపదను తవ్వుకుని దోపిడీకి పాల్పడుతోందని, వారు తక్షణం ఆదివాసీ ప్రాంతాన్ని ..

మైనింగ్‌ మాఫియా తక్షణం ఏజెన్సీ విడిచిపెట్టాలి

ఆదివాసి ఉద్యమ జేఏసీ డిమాండ్‌


జగదాంబసెంటర్‌ :మైనింగ్‌ మాఫియా మన్యంలో విలువైన ఖనిజ సంపదను తవ్వుకుని దోపిడీకి పాల్పడుతోందని, వారు తక్షణం ఆదివాసీ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఆదివాసీ ఉద్యమ జేఏసీ రాష్ట్ర ప్రతినిధి జలియా ఆనందరావు, కూడా సుబ్రహ్మణ్యం డిమాండ్‌ చేశారు. గురువారం జగదాంబాలోని ఓ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ మైనింగ్‌ మాఫియా అక్రమాలపై ఉద్యమిస్తున్న వారిని అణచివేస్తున్నారన్నారు. ఏజెన్సీలో విలువైన ఖనిజ సంపద, బాక్సైట్‌, లేటరైట్‌ వంటి విలువైన సంపద ఉన్నా తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. కొన్ని స్వార్థపర శక్తులు వెనుక నుంచి దీన్ని నడిపిస్తున్నారని, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు తక్షణం దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-10-23T10:22:22+05:30 IST