గిరిజన గురుకులం.. వసతులు మృగ్యం

ABN , First Publish Date - 2022-05-23T07:04:52+05:30 IST

పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థినులకు వసతులు వేధిస్తున్నాయి. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 244 మంది విద్యార్థినులు వి ద్యనభ్యసిస్తున్నారు.

గిరిజన గురుకులం.. వసతులు మృగ్యం
గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల

244 మంది విద్యార్థినులకు 7 గదులే..   

తరగతి గదులు, డైనింగ్‌ హాల్‌లోనే నిద్ర   

నిధుల మంజూరుతోనే ఆగిన నూతన భవనాలు


గోరంట్ల, మే 22: పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థినులకు వసతులు వేధిస్తున్నాయి. పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 244 మంది విద్యార్థినులు వి ద్యనభ్యసిస్తున్నారు. మొత్తం 12 గదులతోనే పాఠశాల ని ర్వహణను నెట్టుకొస్తున్నారు. ఉన్న గదుల్లో ప్రిన్సిపాల్‌, స్టా ఫ్‌, డైనింగ్‌ రూమ్‌, వాటర్‌ప్లాంట్‌, వేస్ట్‌ మెటీరియల్‌కు ఒ క్కో గది చొప్పున వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన ఏడు గదుల్లోనే అన్ని తరగతుల విద్యార్థినులకు విద్యా బోధన సాగించాల్సి ఉంటోంది. మరోవైపు వసతి గదుల కొరత వెంటాడుతోంది. విధిలేని పరిస్థితుల్లో తరగతి గదులు, డై నింగ్‌ హాల్‌లోనే విద్యార్థినులు తమ లగేజీతో పాటు అక్క డే నిద్రపోవాల్సి వస్తోంది. అదనంగా మరో ఆరు తాత్కా లిక షెడ్లు ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఉన్న గదుల్లో సరైన గాలి, వెలుతురు ఉండదు. వేసవిలో విద్యా ర్థినులతో పాటు ఉపాధ్యాయులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కి రవుతున్నారు. చదువుల బాట గతి తప్పుతోంది. 


ఉపాధ్యాయుల కొరత

గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్‌తో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులను కేటాయించారు. 2019లో తెలు గు, సైన్స, ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులుగా ఎం పిక కావడంతో, అప్పటి నుంచి రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో హిందీ టీచర్‌తోనే తెలుగు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ తిప్పలు

గదుల కొరత, పైకప్పు కారుతుండటంతో 2020లో రూ.25లక్షలతో మూడు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు త దితర పనులు చేపట్టారు. కాంట్రాక్టర్‌కు ఇప్పటికీ  బిల్లు లు చెల్లించలేదు. దీంతో ఏడాదిగా అధికారుల చుట్టూ ప్ర దక్షిణలు చేయాల్సి వస్తోందని కాంట్రాక్టర్‌ వాపోతున్నాడు.  మరుగుదొడ్ల ఎత్తు పెంచడంతో మురుగునీరు బయటకు  వెళ్లక కొత్త సమస్య ఉత్పన్నమైంది. మరో మూడు అదనపు గదులకు ప్రతిపాదనలు పంపగా, నేటికీ పనులు మంజూరు కాలేదు. పంచాయతీ కొళాయి నీటిపైనే వి ద్యార్థినులు ఆధారపడాల్సి వస్తోంది. శాశ్వతంగా నీటి సరఫరా చర్యలు కరువయ్యాయి.  


నూతన భవనాల ఊసేలేదు..

బెంగళూరు జాతీయరహదారి పక్కన పాలసముద్రం సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 2017లోనే గురుకుల పాఠశాలకు కేటాయించారు. బెల్లాల చెరువుకు వెళ్లేక్రాస్‌ రోడ్డులో అహుడా, గురుకుల పాఠశాలకు పక్కపక్కనే స్థలాలు గుర్తించారు. జీప్లస్‌-1 ప్రకారం ఎనిమిది గదుల నిర్మాణానికి రూ.40లక్షల నిధులు మంజూరయ్యాయి. కాం ట్రాక్టర్‌  మార్కింగ్‌వేసి పనులు వెంటనే ప్రారంభించి ఆపే శారు. 2021లో పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీన పాఠశాల  స్థ లంలో స్వల్ప మార్పులు చేశారు. ఈమేరకు ప్రతిపాదనలు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. పాఠశాలలో డిజిటల్‌ వి ద్యాబోధనలాంటి ఆధునిక పద్ధతులకు శ్రీకారం చుట్టినా... వసతులు కరువై విద్యార్థినుల చదువులు నత్తనడకన సా గుతున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-05-23T07:04:52+05:30 IST