పశ్చిమ గోదావరి జిల్లాలో గిరిజన కుటుంబం గ్రామ బహిష్కరణ

ABN , First Publish Date - 2022-03-08T02:17:20+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. తమ మాటను వినడం లేదనే

పశ్చిమ గోదావరి  జిల్లాలో గిరిజన కుటుంబం గ్రామ బహిష్కరణ

పశ్చిమ గోదావరి: జిల్లాలో దారుణం జరిగింది. తమ మాటను వినడం లేదనే కారణంతో జీలుగుమిల్లి పంచాయితీ చంద్రమ్మ కాలనీకి చెందిన ఒక గిరిజన కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. తమ పొలాన్ని గిరిజనేతరుడికి కౌలుకి ఇవ్వడానికి నిరాకరించామన్న నెపంతో తమ కుటుంబాన్ని వెలి వేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఊరిలో తమతో ఎవరైనా మాట్లాడినా, పొలం పనులకు పిలిచినా  వారికి పది వేల రూపాయలు జరిమానా విధిస్తారని గ్రామ పెద్దలు ప్రకటించారని  బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. 


Updated Date - 2022-03-08T02:17:20+05:30 IST