వట్టిగెడ్డలో గిరిజనుడి మృతి

ABN , First Publish Date - 2021-03-05T05:38:46+05:30 IST

మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువలో బిడ్డిక నారాయణ (55) అనే గిరిజనుడు మృతి చెందినట్లు చినమేరంగి ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ తెలిపారు.

వట్టిగెడ్డలో గిరిజనుడి మృతి

జియ్యమ్మవలస, మార్చి 4: మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువలో బిడ్డిక నారాయణ (55) అనే గిరిజనుడు మృతి చెందినట్లు చినమేరంగి ఎస్‌ఐ బి.శివప్రసాద్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..  టీకే జమ్ము పంచాయతీ గోర్లివలస గ్రామానికి చెందిన  బిడ్డిక నారాయణకు ఇద్దరు భార్యలు సావిత్రమ్మ, చెల్లమ్మతో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే వారం రోజులుగా ఈయన జాడ కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువు లు ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. తాగుడుకు బానిసైన ఈయన ఇలాగే ఇంటి నుంచి వెళ్లిపోవడం, రెండు, మూడు రోజుల తరువాత తిరిగి రావడం నిత్యం జరుగుతున్న విషయమేనని బంధువులు చెబుతున్నారు. రావాడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

 


Updated Date - 2021-03-05T05:38:46+05:30 IST