‘ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించుకోవాలి’

ABN , First Publish Date - 2022-06-22T05:07:26+05:30 IST

ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను, రిజ ర్వేషన్లను పరిరక్షించుకోవాలని ఆదివాసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు వరహాల కృష్ణారావు అన్నారు. స్థానిక వైటీసీ లో సంఘ జిల్లా సమావేశం మంగళవారం నిర్వహించా రు.

‘ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించుకోవాలి’

పాతపట్నం: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను, రిజ ర్వేషన్లను పరిరక్షించుకోవాలని ఆదివాసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు వరహాల కృష్ణారావు అన్నారు. స్థానిక వైటీసీ లో సంఘ జిల్లా సమావేశం మంగళవారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 శాతం రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ వక్రమార్గంలో గిరిజనేతరులు రిజర్వేషన్‌ అనుభ విస్తున్నారని ఆరోపించారు. వడ్డి ఒరియా, ఏనేటి కొండ వంటి కులాల వారు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో రిజర్వేషన్‌లు అనుభవిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీయులంతా అప్రమత్తమై రిజర్వేషన్లను పరిరక్షించుకోవాలని కోరారు. కార్య క్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గురాడి అప్పన్న మండ ల కార్యదర్శి జన్ని గోపాల్‌, బైదలాపురం సింహాచలం, దొర పార్వతీశం, సవర చొక్కారావు, బొంతు బాలకృష్ణ సీది మాధవరావు, తదితరులు పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2022-06-22T05:07:26+05:30 IST